మా కుటుంబ సభ్యులు పోటీ చేస్తే తప్పేంది?


పొత్తులు లేవు
ఒంటరిగానే పోటీ
సర్వేలు మాకు అనుకూలం
గజ్వేల్‌ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తా : కేసీఆర్‌
హైదరాబాద్‌, మార్చి 23 (జనంసాక్షి) :
‘మా కుటుంబ సభ్యులు రాజకీయాల్లో ఉంటే తప్పేంటి.. ఎన్నికల్లో పోటీ చేయడంలో తప్పేముంది’ అంటూ టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కె. చంద్రశేఖర్‌రావు ప్రశ్నించారు. ఆది వారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాటా ్లడారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషిం చిన తన కుటుంబ సభ్యులు ఎన్నికల్లో పోటీ చేయడంలో తప్పేమైనా ఉందా అంటూ ప్రశ్నించారు. తన కుటుంబ సభ్యులకు రాజకీయాల్లో ఉండటానికి కావాల్సిన అర్హత లన్నీ ఉన్నాయని తెలిపారు. తమ పార్టీ గెలిస్తే దొరల పాలన వస్తుందంటున్న కాంగ్రెస్‌ దానికి అర్థం చెప్పాల ని అన్నారు. ఈసా రి ఎన్ని కల్లో గజ్వేల్‌ నుంచి ఎమ్మె ల్యేగా మాత్రమే పోటీ చేస్తా నని తెలిపారు. పార్ల మెం ట్‌కు పోటీ చేయబోన న్నా రు. కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు ముగిసిన అధ్యాయ మని, ఇక పార్టీతో పొత్తు ప్రకస్తే లేదని తేల్చిచెప్పారు. మం త్రిగా ఉన్నప్పుడు పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ వ్యతి రేకంగా పనిచేశారని ఆయన అవినీతిని బయట పెడ తానని కేసీఆర్‌ అన్నారు. తెలంగాణలో బీసీని ముఖ్య మంత్రిని చేస్తానంటున్న చంద్రబాబునాయుడు సీమాం ధ్రలో సామాజిక న్యాయం గురించి ఎందుకు మాట్లాడ లేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌తో పొత్తు లేకున్నా సీపీఐతో మాత్రం చర్చలు జరుపుతున్నామని ఆయన తెలిపారు. అమరవీరులకు టికెట్ల కేటాయింపుపై స్పంది స్తూ 1200 మంది తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్నారని, అంతమందికి టికెట్లు ఇవ్వడం సాధ్యం కాదని అన్నారు. దుమ్ముగూడెం ప్రాజెక్టులో అక్రమాలకు పాల్పడిన మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈమేరకు గవర్నర్‌కు లేఖ రాసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి పదవికి రాజీ నామా చేసే ముందు ఫైళ్లపై ఎన్నో సంతకాలు పెట్టారని వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వైఎస్‌ కాలంలో ప్రాజెక్టుల నిర్మాణంలో ఎన్నో అక్రమాలు జరిగాయని,

వాటిపైనా విచారణ జరపాలని కోరారు. అక్రమ ప్రాజెక్టులను తెలంగాణ బిడ్డలెవరూ అంగీకరించరని వాటిని వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అక్రమ ప్రాజెక్టులు వద్దని తెలంగాణవాదులు మొత్తుకున్నా పొన్నాల వాటికి వంతపాడారని అన్నారు. నాగార్జునసాగర్‌ ఎడమ కాలువను తెలంగాణకు దూరం చేసేందుకు కిరణ్‌ కుట్ర పన్నారని ఆరోపించారు. ఆ కాలువ రద్దు చేసేందుకు పొన్నాల సంతకం పెట్టారని అన్నారు. తానైతే ఆ పదవికే రాజీనామా చేశావడినని అన్నారు. జలయజ్ఞంలో జరిగిన అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే తెలంగాణను ఆంధ్రోళ్లకు తాకట్టు పెడతారని, ప్రజలు దీనిని గుర్తించాలనని కోరారు. చెరుకు సుధాకర్‌కు అవకాశమిస్తే నిలబెట్టుకోలేదని, రాజకీయాల్లో భాగంగానే కొండా దంపతులు టీఆర్‌ఎస్‌లో చేరానని తెలిపారు. సర్వేలు తమకు అనుకూలంగా ఉన్నాయని 70 అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ విజయం సాధించి తీరుతుందని ఆయన చెప్పారు.