మావోయిస్టు పార్టీపై
నిషేధం ఎత్తేయండి
రాజకీయ ఖైదీలను
విడుదల చేయండి
మేనిఫెస్టోలో ప్రజల డిమాండ్లు చేర్చండి : వరవరరావు
హైదరాబాద్, మార్చి 24 (జనంసాక్షి) :
మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేయాలని విప్లవ రచయిత వరవరరావు కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మేనిఫెస్టో కమిటీ బాధ్యు లను కోరారు. సోమవారం ఆయా కమిటీల బాధ్యులతో భేటీ అయిన వరవరరావు ఏళ్లకేళ్లుగా జైళ్లలో మగ్గుతున్న రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల డి మాండ్లను పార్టీ మేనిఫెస్టోల్లో చేర్చాలని
కోరారు. రాజకీయ ఖైదీల విడుదలకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సానుకూలంగా స్పందించారని వరవరరావు తెలిపారు. తెలంగాణలో పౌర హక్కులను రక్షించేలా టీఆర్‌ఎస్ మేనిఫెస్టో ఉండాలని కేసీఆర్‌ను కోరామన్నారు. మావోయిస్టులపై నిషేధం ఎత్తివేసే అంశాన్ని మేనిఫెస్టోలో పెడతామని కేసీఆర్ తమకు హామీ ఇచ్చారని వీవీ తెలిపారు. సత్ప్రవర్తన కలిగిన రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని ఆయన టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాలకు సూచించారు. పొన్నాల స్పందిస్తూ వరవరరావు సూచనలను పరిశీలిస్తామని తెలిపారు.