ఉద్యమంలా భీం దీక్ష
రాష్ట్ర వ్యాప్తంగా పాటిస్తున్న బహుజనులు
యువతలో సామర్థ్యాల వెలికితీతే లక్ష్యం
కల్లు కాదు కలం కావాలి
విగ్రహాలు కాదు విజ్ఞానం కావాలి
పిల్లల అక్షరాభ్యాసమే ఆంగ్లంలో చేయించాలి
డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పిలుపు
హైదరాబాద్, మార్చి 28 (జనంసాక్షి) :
దళిత, బహుజన, ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయులను స్మరి స్తూ రాష్ట్ర వ్యాప్తంగా భీం దీక్ష ఉద్యమం లా సాగుతోంది. తరతరాలుగా అణచివే తను, పీడనను ఎదుర్కొన్న వర్గాల విము క్తం కోసం పాటు పడిన డాక్టర్ బాబాసా హెబ్ భీమ్‌రావు రాంజీ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావుపూలే, సావిత్రి బాయి పూలే తదితరుల జీవితాన్ని రేపటి తరాల కు అందించడం కోసం ఈ దీక్షలను తలపెట్టా రు. ఎవరి త్యాగాల వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ల జీవితాల్లో వెలుగులు నిండాయో వారి త్యాగాల ను చిరస్మరణీయం చేయ డం, వారిని స్ఫూర్తిగా తీసుకొని వెనుకబడిన వారికి చేయూతనందిం చేలా యువత, విద్యార్థు ల్లో చైతన్యం తీసుకురా వడమే లక్ష్యంగా ఈ దీక్షలను నిర్వహిస్తున్నా రు. బహుజనులకు రాజ్యాధికారం సిద్ధిం చేందుకు ఆజన్మాంతం కృషి సలిపిన బహుజన సమాజ్‌పార్టీ వ్యవస్థాపకుడు కన్షీరాం జయంత్రి మార్చి 15న రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన భీం దీక్ష భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేద్క ర్ జయంతి ఏప్రిల్ 14న ముగుస్తుంది. ఈ నెల రోజుల కాలంలో దీక్ష పాటిస్తున్న వారంతా ఉత్తమ నియమా లను పాటిస్తూ మహనీయుల ఆశయాలను, జీవిత చరిత్ర ను అన్ని వర్గాల ప్రజలకు చేరవేసేందుకు కృషి చేస్తున్నా రు. మనం ఇంతవరకు విగ్రహారాధనతో కూడిన దీక్షలను మాత్ర మే చూశాం దానికి భిన్నంగా భావజాల వ్యాప్తే లక్ష్యం గా సాగుతున్న భీం దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా అపూర్వ ఆదరణ లబి óస్తోంది. యువత లో నిద్రాణంగా ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికితీసి వారిని వెను కబడిన, దళిత, ఆదివాసీ, గిరిజన వర్గాల ఆత్మగౌరవ ప్రదీప్తికి, దేశాభ్యున్నతికి ఉపయోగించడమే లక్ష్యంగా దీక్ష సాగిస్తు న్నట్లు స్వేరోస్ రాష్ట్ర కమిటీ బాధ్యులు, సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. సమాజంలో అట్టడుగున జీవిస్తున్న వర్గాలను మొదటి స్థానంలోకి తీసుకురావడానికి అంబేద్కర్, పూలే తదితర మహనీయులు తమ జీవి తం ద్వా రా జాతి జనులలో ప్రోదిగొల్పిన ఆత్మవి శ్వాసాన్ని పునరుత్తేజితం చేసేం దుకు పాటుపడుతున్నారు. కన్షీరాం జ యంతి నుంచి అంబేద్కర్ జయంతికి మధ్య గల నెల రోజులను భీం మాసంగా పాటిస్తున్నామని, ఇది అతిపవిత్రమైనది వారు పేర్కొన్నారు. ఈనెలరోజుల్లో దళిత, బహుజన, ఆదివాసీ, గిరిజన కుటుంబాలు మహనీయులకు కృతజ్ఞతా నియమావళిని అర్పించాలని సూచించారు. ప్రతి నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో గంట చొప్పున మహనీయుల చరిత్రను, బోధనలను చదవాలి, చదివించాలని, చిన్న పిల్లలకు వారి జీవిత చరిత్రను విడమరిచి చెప్పాలని తెలిపారు. మహనీయుల చరిత్రను, బోధనలను, ఆశయాలను, ఆలోచనలను పల్లెలు, తండాలు, కాలనీల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రముఖ వక్తల ద్వారా బోధించాలి. అన్ని గ్రామాలు, పట్టణాల్లో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి అభివృద్ధికి స్వేరోలు పాటు పడాలి. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారులు తమ మార్చి నెల ఆదాయంలో ఒక శాతం డబ్బును వినియోగించి విలువైన పుస్తకాలు, స్టడీమెటీరియల్స్ కొనుగోలు చేసి విజ్ఞాన కేంద్రాల ద్వారా విద్యార్థులకు అందుబాటులో ఉంచాలి. తమ వద్ద ఉన్న మహనీయుల జీవిత చరిత్రలను ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా విజ్ఞాన కేంద్రానికి అందజేయాలి. దేవుళ్ల పేరుతో పండుగలు, ఉత్సవాలు, పుట్టినరోజు వేడుకలకు డబ్బు వృథా చేయవద్దని సూచించారు. దీక్షా సమయంలో మాంసాహారాన్ని పూర్తిగా త్యజించి శాఖాహారమే తీసుకోవాలి. కల్లు కాదు కలం గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి. విగ్రహాలు వాటి ఆరాధన కాదు విజ్ఞానాన్ని సముపార్జించుకోవాలి. దీక్ష సమయంలో సిగరెట్లు, గుట్కాలు, తంబాకు, పాన్లు, మద్యానికి దూరంగా ఉండాలి. ప్రతి రోజూ గంటపాటు వ్యాయామం చేయాలి. ఇతరులను ద్వేషించొద్దు. మహనీయుల జన్మ స్థలాలు, వారి జ్ఞాపక చిహ్నాలు, సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలను కుటుంబ సమేతంగా సందర్శించాలి. టీవీ సీరియళ్లు చూడటం మానేసి మహనీయుల జీవిత గాథలను తెలిపే సినిమాలు, డాక్యుమెంటరీలు చూడాలి. జాతి చరిత్రను తెలిపే పురాణాలను కళాశాల ప్రదర్శనల ద్వారా వివరించాలి. పిల్లల అక్షరాభ్యాసమే ఇంగ్లిష్‌లో చేయించాలి. భీం దీక్ష ద్వారా దళిత, బహుజన, ఆదివాసీ, గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు పాటు పడటం, అందుకు విద్యార్థి, యువతకు ప్రత్యేక బోధనలు చేయడమే లక్ష్యమని డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.