అధికారంలోకి మేమే..
అభివృద్ధి మాతోటే సాధ్యం : కేసీఆర్
తెరాసలో చేరిన బాబుమోహన్, పల్లె, ఆకుల
హైదరాబాద్, ఏప్రిల్ 2 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్రంలో నూటికి నూరుశాతం టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడి తీరుతుందని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా జరిగి తీరుతుందన్నారు. కొత్త రాష్ట్రం.. కొత్త నాయకత్వం.. కొత్త పంథాతో ముందుకు పోదామని టీఆర్‌ఎస్ అధినేత తెలంగాణ ప్రజానీకానికి పిలుపునిచ్చారు. ఎవరెన్ని శాపాలు పెట్టినా నూ రు శాతం టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని కేసీఆర్ స్పష్టం చ ేశారు. ప్రముఖ విద్యావేత్త పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రొఫెసర్ సీతారాం నా యక్, మాజీ మంత్రి బాబూమోహన్, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే ఆకుల రా జేందర్ తదితరులు బుధవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి కేసీఆర్ కం డువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ తలరాత మారాలంటే
పాత ప్రభుత్వాల వల్ల కాదన్నారు. ఇప్పటి వరకు వీరంతా పాలించిన వారేనని, వారి పాలన ఎలా ఉంటుందో ప్రజలకు తెలియంది కాదన్నారు. తెలంగాణ సార్థకం కావాలెంటే కొత్త ప్రభుత్వం టీఆర్‌ఎస్ నాయకత్వంలోకి రావాలన్నారు. మంచి జరగాలంటే మంచి ప్రభుత్వం రావాలని, అంటే రాజకీయ అవినీతి అంతం కావాలన్నారు. కాంగ్రెస్, టీడీపీ ఆకాశం నుంచి ఊడిపడలేదు. తెలంగాణలో సకల కష్టాలకు ఈ రెండు పార్టీలే కారణమన్నారు. ఈ పార్టీలు ప్రజలను గోల్‌మాల్ చేసుడుతప్ప అభివృద్ధి చేయలేదన్నారు. ఇది మన కళ్లముందు కనిపిస్తున్న నిజమన్నారు. డబ్బులకు, తాయిలాలకు ప్రజలు మోసపోవదన్నారు. కోటి ఎకరాలకు నీరు అందించే బాధ్యత నాదని ఆయన హావిూ ఇచ్చారు. తెలంగాణ పచ్చబడాలి. నిరంతరం కరెంట్ ఉత్పత్తి చేసేందుకు పోరాడుతాం. 40 లక్షల మంది విద్యార్థులకు ఉచిత నిర్బంధ విద్య అందిస్తాం. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని పునరుద్ఘాటించారు. తెలంగాణలో నూటికి నూరుశాతం తెరాస అధికారంలోకి వస్తుందని కేసీఆర్ భరోసా వ్యక్తం చేశారు. ఎవరెన్ని శాపాలు పెట్టినా తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమని కేసీఆర్ అన్నారు. కొత్త రాష్ట్రం, కొత్త నాయకత్వం, కొత్త పంథాలో ముందుకు పోవాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ తలరాత మారాలంటే పాత ప్రభుత్వాలతో సాధ్యం కాదన్నారు. తన గుండెల్లో పదిలంగా తెలంగాణ ఉందన్నారు. తెలంగాణలో సకల బాధలకు కాంగ్రెస్, టీడీపీయే కారణమన్నారు. మంచి ప్రభుత్వం కావాలంటే రాజకీయ అవినీతి అంతం కావాలన్నారు. మొదట రాజకీయ అవినీతిని పాతరవేయాలన్నారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా అభివృద్ధి కావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. తెలంగాణ పునర్ నిర్మాణం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని ప్రముఖ విద్యావేత్త పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన తెలంగాణ భవన్‌లో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కే అధికారం ఇవ్వాలని పిలుపునిచ్చారు. నల్లగొండ సమస్యలు తీరాలంటే టీఆర్‌ఎస్ అధికారంలోకి రావాలన్నారు. కార్యక్రమంలో ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి సంపాదకత్వంలో రానున్న జంబి అనే త్రైమాసిక పత్రికను కేసీఆర్ ఆవిష్కరించారు.