కొలువుదీరిన గవర్నర్ సలహాదారులు
హైదరాబాద్, ఏప్రిల్ 2 (జనంసాక్షి) :
రాష్ట్ర గవర్నర్ నరసింహ న్ సలహాదారులు కొలువు దీరారు. వారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహం తి ‘డి’ బ్లాక్‌లో కార్యాల యాలను కేటాయించారు. మహారాష్ట్ర డిజిపిగా పని చేసి పదవీ విరమణ చేసి న ఐపీఎస్ అధికారి ఎన్. రాయ్, రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన
కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేసిన సలావుద్దీన్ అహ్మద్‌లను కేంద్ర హోం శాఖ గవర్నర్ సలహాదారులుగా నియమించింది. ఈ నేపథ్యంలో వారు బుధవారం సచివాలయం చేరుఉని సీఎస్‌ను కలిశారు. తమ చాంబర్లను పరిశీలించారు. వారికి మహంతి శాఖల బాధ్యతలను అప్పగించారు. సలావుద్దీన్ అహ్మద్‌కు ప్రణాళిక, ఆర్థిక, రెవెన్యూ, ఇందన, పరిశ్రమలు, వాణిజ్యం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, న్యాయశాఖ, పర్యావరణ శాఖ, అడవులు, శాస్త్ర సాంకేతిక శాఖ, పౌర సరఫరాలు, మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ప్రాధమిక, మాధ్యమిక, ఉన్నత విద్యాశాఖలు కేటాయించారు. కాగా మిగిలిన శాఖలను ఏఎన్ రాయ్‌కి కేటాయించారు. సీఎస్‌ను కలిసి చాంబర్‌లోకి వచ్చిన రాయ్ మొదట సాధారణ పరిపాలనా శాఖ అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రపతి పాలనతోపాటు రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉండనుండడం, ఇక్కడి పాలన పగ్గాలు గవర్నర్ చేతిలోకి వెళ్లనున్నందున.. ఆయన సలహాదారులుగా వీరిద్దరినీ కేంద్ర ¬ంమంత్రిత్వశాఖ నియమించింది. ఉమ్మడి రాజధాని పాలన అంశాల్లో వీరు గవర్నర్‌కు సహకరిస్తారు. ఇదిలా ఉండగా వీరిద్దరికీ నగరంలోని దిల్‌కుశ్ అతిథిగృహంలో ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దిల్‌కుశ అతిథిగృహం రాజ్‌భవన్‌కు పక్కనే ఉన్నందున గవర్నర్‌కు అందుబాటులో సలహాదారులుంటారనే అభిప్రాయంతో వారికి ఇక్కడే కార్యాలయాలను కేటాయించనున్నారు.