‘ఆదర్శ్‌’లో దేవయాని ‘కోణం’


న్యూఢిలీ, ఏప్రిల్‌ 5 (జనంసాక్షి) :
తప్పుడు అఫిడవిట్‌ ఆధారంగా ఒక ఫ్లాట్‌ను పొందినందుకు ఆదర్శ్‌ హౌసింగ్‌ కుంభకోణం లో దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడె, ఆమె తండ్రి ఉత్తమ్‌ ఖోబ్రగడెపై సీబీఐ చార్జిషీట్‌ దాఖలు చేసే అవకాశం ఉంది. తప్పుడు ధ్రువీ కరణ పత్రం చూపించి ఫ్లాట్‌ కొనుగోలు చేయ డం, ప్రభుత్వ కోటా కింద తమకు కేటాయిం చిన ఫ్లాట్‌ గురించి, ఇంటి స్థలం గురించి స మాచారం ఇవ్వకుండా దాచిపెట్టడం వంటి విషయాలకు సంబంధించి సీబీఐకి కీలక ఆధా రాలు లభించాయని వర్గాలు తెలిపాయి. దూవ యాని తండ్రి ఉత్తమ్‌ ఖోబ్రగడె మహారాష్ట్ర కేడ ర్‌కు చెందిన ఐఏఎస్‌
అధికారి. ఆయన మహారాష్ట్ర హౌసింగ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ మాజీ సీఈఓ ఆదర్శ్‌ హౌసింగ్‌ కుంభకోణంలో చట్టవిరుద్ధ లబ్ధిదారులు, బినామీదారుల గురించి సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఆదర్శ్‌ హౌసింగ్‌ సొసైటీలో 25మంది చట్టవిరుద్ధంగా ఫ్లాట్లు పొంది నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లు కట్టారని సీబీఐ దర్యాప్తులో తేలింది. 2005లో ఓషివారాలోని మరో ప్రభుత్వ హౌసింగ్‌ సొసైటీలో కూడా దేవయాని ఫ్లాట్‌ పొందినట్లు సీబీఐకి పత్రాలు లభించాయి. డిఫెన్స్‌ ఎస్టేట్‌ నిబంధనల ప్రకారం ఒక సభ్యుడు రాయితీ ధరలపై లభించే రెండు హౌసింగ్‌ సొసైటీలలో ఫ్లాట్లు పొందకూడదు. ఆదర్శ్‌ హౌసింగ్‌ సొసైటీకి చెందిన 102మంది సభ్యులతో 25మంది ఫ్లాట్లు పొందడానికి అనర్హులని, ఈ కుంభకోణంపై దర్యాప్తు జరిపిన రిటైర్డ్‌ హైకోర్టు జడ్జీ జేఏ పాటిల్‌ తన నివేదికలో తేల్చారు.