ప.గో. జిల్లా : పలు గ్రామాల్లో నిలిచిపోయిన పోలింగ్
పశ్చిమగోదావరి, ఏప్రిల్ 6 : పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీలోని పలు గ్రామాల్లో పోలింగ్ నిలిచిపోయింది. జిలిగిమిల్లి మండలంలోని దర్బగూడెం, పిం. అంకెపాలెం గ్రామాల్లో ఓటరు జాబితా తప్పుల తడకగా ఉన్నందున గందరగోళం తలెత్తింది. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు పోలింగ్‌ను అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఓటరు జాబితా సరి చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.