కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన‌ ఓయూ

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ తీరుపై ఓయూ జెఎసి నిప్పులు చెరిగిది. తొలుత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం జరిపిన విద్యార్థి జెఎసి నేతల పేర్లు ప్రకటించి, తర్వాత ఆ పేర్లు మార్చడం తమను అవమానించడమేనని ఓయూ జెఎసి నేతలు పేర్కొన్నారు. దరువు వెంకన్న, శ్రీశాంత్‌లకు స్థానం కల్పిస్తున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం, చివరి క్షణంలో పేర్లు మార్చివేసింది.తెలంగాణ రాజకీయ ఐకాస నేత అద్దంకి దయాకర్, తెలంగాణ ప్రజా సంఘాల జెఎసి నేత గజ్జెల కాంతంలకు స్థానాలు కేటాయిస్తున్నట్లు గతవారం ప్రకటించింది. మధ్యలోనే అభ్యర్థుల ప్రకటన నిలిపివేసిన కాంగ్రెస్, తాజాగా ప్రకటించిన జాబితాలో ఉద్యమ నేతలకు చోటు కల్పించలేదు. దీంతో ఆగ్రహించిన ఓయూ జెఎసి నేతలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించేందుకు ప్రచారం చేస్తామని తెలిపింది.ఇదిలా ఉంటే రాష్ట్ర మాజీ హోంమంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరం, నల్గొండ జిల్లా కోదాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లు మంగళవారం వెల్లడిస్తామని ఎఐసిసి వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు తమ వారసులకు టిక్కెట్లు ఇప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుమతించలేదని సమాచారం.