భ్ర‌ద‌తావ‌ల‌యంలో గాంధీభవన్‌

హైదరాబాద్:  గాంధీభవన్‌కు హైసెక్యూరిటీ ఏర్పాటు చేశారు.తెలంగాణ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదలైన నేపథ్యంలో ఆశావహులు టికెట్ రానట్లయితే గాంధీభవన్‌కు చేరుకుని ఆందోళన చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఏర్పాటు చేశారు. ఇప్పటికే టికెట్ ఆశించి భంగపడ్డవారు అగ్గిమీద గుగ్గిలమైతున్నట్టు సమాచారం.