21 శాసనసభ స్థానాలకు 21 మంది అభ్యర్థులతో
హైదరాబాద్ : ఇంతకు ముందు 17 శాసనసభా నియోజకవర్గాలకు అభ్యర్థులను సిపిఎం తెలంగాణ కమిటీ ప్రకటించింది.తెలంగాణ ప్రాంతంలో మరో 21 శాసనసభ స్థానాలకు పోటీ చేయనున్నట్లు సిపిఎం ఆదివారం ప్రకటించింది. తాజాగా ప్రకటించిన జాబితాలో మహబూబాబాద్ నుంచి బానోత్ సీతారామ్ నాయక్ పోటీ చేస్తారని సిపిఎం తెలంగాణ శాఖ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.ఇంకా ఎ వెంకన్న (డోర్నకల్), డి సమ్మయ్య (ములుగు), సిహెచ్ ఆంజనేయులు (అచ్చంపేట), ఎ రాములు (మహబూబ్ నగర్), బి రామచందర్ (జహీరాబాద్), కొండపల్లి లక్ష్మీ బాయి (నర్సాపూర్), సిహెచ్ యాదయ్య (మేడ్చల్), డిజి నర్సింహారావు (మల్కాజిగిరి), ఎస్ నర్సింహారెడ్డి (ఉప్పల్), మహ్మద్ హుస్సేన్ (జుబ్లీహిల్స్), డి. రామచంద్ర (మహేశ్వరం), ఎం రాములు (తుంగతుర్తి), కె నాగిరెడ్డి (నాగార్జున సాగర్), టి వీరారెడ్డి (భువనగిరి), డి రవి నాయక్ (దేవరకొండ), ఎస్ శ్రీనివాస్ రెడ్డి (మునుగోడు), జె బసవయ్య (కోదాడ), మల్లు లక్ష్మి (సూర్యాపేట), వై శ్రీకాంత్ (ఖమ్మం), భూక్యా వీరభద్రం (వైరా) పోటీ చేస్తారని సిపిఎం తెలిపింది.