ఆమ్ ఆద్మీపార్టీ అభ్యర్థి పోటీ నుంచి తప్పుకున్న చందనా చక్రవర్తి

 హైదరాబాద్: మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీపార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన నటి, సామాజిక కార్యకర్త చందనాచక్రవర్తి వ్యక్తిగత కారణాల వల్ల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం రాత్రి ‘సాక్షి’కి తెలిపారు.పార్టీ నేతలతో తనకు ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని, స్వచ్ఛందంగానే తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశారు. దీంతో ఆ స్థానంలో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు మనవడు డాక్టర్ సుధాకిరణ్‌ను బరిలోకి దించాలని ఆప్ నేతలు యోచిస్తున్నట్లు సమాచారం.