ఎర్రగడ్డ ఈఎస్‌ఐ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం
హైదరాబాద్: ఎర్రగడ్డలోని ఈఎస్‌ఐ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆస్పత్రిలోని స్టోర్‌రూమ్‌లో ఉన్న పాత సామాగ్రి తగలబడింది. అగ్నిమాపక దళ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.