నాగం కిడ్నాప్ కలకలం …?

(జ‌నంసాక్షి):ఎమ్మెల్యే నాగం జనర్థాన్ రెడ్డి కిడ్నాప్ గురయ్యారని వదంతలు వచ్చాయి . తుర్కుయాంజాల్ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారును దుండగులు అడ్డగించారని.. కారులో స్మోక్ బాంబు విసిరి నాగం ను అపహరించినట్లు వార్తలు వచ్చాయి . కాగా తాను ఇంట్లోనే ఉన్నానని అవన్ని ఒట్టి పుకార్లేనని 6టీవీతో స్పష్టం చేశారు. టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసిన నాగం గత కొద్దికాలం క్రితమే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా మహబూబ్ నగర్ నుంచి బీజేపీ తరుపున ఎంపీ గా పోటీచేయనున్నారు.