నామినేషన్లకు నేడే చివరి రోజు


అంటుకుంటున్న పార్టీల కుంపట్లు
కిరోసిన్‌ సీసాలు, సిగపట్లు
అన్ని పార్టీల కార్యాలయాల ముందు అదే సీ
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రాంతంలో పది జిల్లాల్లో జరుగనున్న ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం బుధవారంతో ముగి యనుంది. మొత్తం 119 అసెంబ్లీ, 17ఎంపీ స్థానాలకు నామినేషన్లు 9వ తేదీతో ముగియ నున్నాయి. దీంతో చాలామంది నేడు నామినేషన్లు వేసేందుకు సిద్దంగా ఉన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటన జరిగిన తరవాత జరుగుతన్న తొలి అసెంబ్లీకి జరుగుతన్న ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ గజ్వెల్‌ అసెంబ్లీ నుంచి పోటీచేస్తు న్నారు. అలాగే మెదక్‌ లోక్‌సభ స్థానం నుంచి కూడా పోటీ చేయబోతున్నారు. బుధవారం ఉద యం ఆయన సిద్దిపేట సవిూపంలోని తన ఇష్ట దైవం కోనాయపల్లికి వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచి నేరుగా సంగారెడ్డి చేరుకుని 11 గంటలకు ఎంపీగా నామినేషన్‌ వేస్తారు. అలాగే 12 గంటలకు గజ్వెల్‌ చేరుకుని ఎమ్మెల్యేగా నామినేషన్‌ వేస్తారు. ఈ రెండు స్థానాల నుంచి ఆయన పోటీ చేసేందుకు సిద్దం అయ
హుజూర్‌ నగర్‌ నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఇక్కడ తెలంగాణ కోసం ఆత్మాహుతికి పాల్పడిని శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ పోటీచేస్తున్నారు. ఆమెకు మద్దతుగా ప్రచారం చేపడతారు. అమరుల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ ఆయన తన ప్రచారాన్ని సింబాలిక్‌గా ఇక్కడి నుంచి చేపట్టబోతున్నారు. ఇక ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఒంటరి పోరుకు సిద్ధమయ్యింది. అయితే తెలంగాణలో బహుముఖ పోటీ జరుగబోతోంది. బిజెపి-టిడిపిలు ఉమ్మడి పోరుకు దిగుతున్నారు. కాంగ్రెస్‌ -సిపిఐలు సీట్ల సర్దుబాటు చేసుకున్నారు. కేవలం ఒక లోక్‌సభ,8 అసెంబ్లీ సీట్లపై మాత్రమే వీరికి అవగాహన కుదరింది. ఇక టిడిపి, కాంగ్రెస్‌ల నుంచి జోరుగా వలసలు అందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆందోళనలు కూడా చోటుచేసుకున్నాయి. ఇక నిజామాబాద్‌ నుంచి తొలిసారిగా బరిలోకి దిగుతున్న కల్వకుంట్ల కవిత కూడా బుధవారం నాయమినేషన్‌ వేయనున్నారు. సిద్దిపేటలో హరీష్‌ రావు కూడా బుధవారమే నామినేషన్‌ వేస్తారు. పలువురు ప్రముఖులు కూడా బుధవారం చివరి రోజు కావడంతో నామినేషన్లకు సిద్దంగా ఉన్నారు. ఇక ఎన్నికల పొత్తులో ఎన్నో చిత్రాలు చోటు చేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే, సిపిఎం నేత నోముల నర్సింహయ్య టిఆర్‌ఎస్‌లో చేరడంతో పాటు, నాగార్జున సాగర్‌ నుంచి పోటీకి దిగారు. ఇక కాంగ్రెస్‌లో టిక్కెట్లు దక్కన ఇవారు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఖరారు చేస్తుండటంతో గాంధీభవన్‌లో నిరసన మంటలు చెలరేగుతున్నాయి. టికెట్లు దక్కని పలువురు నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాంద్రాయణగుట్ట టికెట్‌ తమ నేతకే కేటాయించాలంటూ రాజేందర్‌ అనుచరులు ధర్నా చేశారు. అలాగే, నిజామాబాద్‌ అర్బన్‌ టికెట్‌ ఆకుల లలితకే ఇవ్వాలంటూ ఆమె అనుచరులు కూడా భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. డీఎస్‌ ఎంతగా ప్రయత్నించినా ఆమెకు టిక్కెట్‌ దక్కలేదు. కొల్లాపూర్‌ టికెట్‌ను తమ నాయకుడు విష్ణువర్ధన్‌ రెడ్డికే ఇవ్వాలంటూ మహబూబ్‌నగర్‌ జిల్లా కార్యకర్తలు తీవ్రస్థాయిలో ఆందోళన చేశారు. పలువురు నాయకులు, కార్యకర్తలు గాంధీభవన్‌ గేట్లు తోసుకుని, కార్యాలయ ఆవరణలో బైఠాయించారు. గాంధీ భవన్‌ ఎదుట మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ నేతలు ఆందోళనకు దిగారు. మామిళ్ల విష్ణువర్దన్‌రెడ్డికి టికెట్‌ కేటాయించకుండా పార్టీలో లేని బీరం హర్షవర్ధన్‌రెడ్డికి టికెట్‌ ఎలా కేటాయిస్తారని నిరసన వ్యక్తం చేస్తున్నారు. జూపల్లి కృష్ణారావుపై పోరాడిన విష్ణువర్దన్‌రెడ్డికే ఎమ్మెల్యే సీటు కేటాయించాలని ఆయన అనుచరులు డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు టీఆర్‌ఎస్‌లో ఇంకా ప్రకటించకుండా మిగిలి ఉన్న స్థానాలపై సస్పెన్స్‌ కొనసాగుతుంది. పెండింగ్‌లో ఉన్న స్థానాలపై టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తుది కసరత్తు ప్రారంభించారు. తుంగతుర్తి, మునుగోడు, నల్గొండ, దుబ్బాక, ఇబ్రహీం పట్నం, శేరిలింగంపల్లి, ఇల్లందు, జూబ్లిహిల్స్‌, పాలేరు, రాజేంద్రనగర్‌ స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. సీట్ల కోసం టీఆర్‌ఎస్‌లో ముందు నుంచి ఉన్న రామలింగారెడ్డి, శ్రవణ్‌, కర్నె ప్రభాకర్‌, నాయిని నర్సింహారెడ్డితో పాటు ఎస్సీ, ఎస్టీ విభాగాల అధ్యక్షులు వేచి చూస్తున్నారు. ఇదిలావుంటే ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి అధ్యక్షునిగా రేగా కాంతారావుని నియమించారు. పినపాక అంసెబ్లీ స్థానాన్ని కాంతారావు త్యాగం చేశారని టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. త్యాగానికి తగిన ఫలితం కాంగ్రెస్‌ పార్టీ అందజేస్తుందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తాను 40 ఏళ్లపాటు కాంగ్రెస్‌ పార్టీని నమ్ముకుని పనిచేస్తే, ఆ పార్టీ తనకు నమ్మక ద్రోహం చేసిందని వనమా మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలను సాధించడం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికే సాధ్యమని, రాష్ట్రానికి వైఎస్‌ జగన్‌ లాంటి యువ నాయకత్వం అవసరమని ఆయన అన్నారు. ఆయనకు టిక్కెట్‌ ఇవ్వకుండా పొత్తులో కొత్తగూడెం సీటును సిపిఐకి కేటాయించారు. దీంతో ఆయన హైదరాబాద్లో వైఎస్‌ జగన్‌ సమక్షంలో ఆయన మంగళవారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తాను కాంగ్రెస్‌ పార్టీలో అన్ని పదవులను వదులుకుని వైఎస్‌ఆర్సీపీలో చేరినట్లు చెప్పారు. ఖమ్మంలో బీసీలకు కాంగ్రెస్‌ పార్టీ అన్యాయం చేసిందని వనమా మండిపడ్డారు. మరోవైపు మాజీ డిజిపి వైకాపాలో చేరారు. ఆయన కూడా మల్కాజిగిరి నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇక వైరా నుంచి సిపిఐ ఎమ్మెల్యేగా ఉన్న చంద్రావతి టిఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకుని తిరిగి అక్కడి నుంచే నామినేషన్‌ వేయబోతున్నారు. కాంగ్రెస్‌ నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్‌ కూడా బుధవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి నల్గొండ అసెంబ్లీ స్థానానికి, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి భువనగిరి లోక్‌సభ స్థానానికి నామినేషన్‌ వేయనున్నారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ స్థానానికి నామినేషన్‌ వేయడంపై టీడీపీ నేత రేవంత్‌రెడ్డి వెనక్కి తగ్గారు. నామినేషన్‌ వేయడాన్ని విరమించుకోవాలని చంద్రబాబు సూచించటంతో రేవంత్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటివద్ద టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానాన్ని రేవంత్‌రెడ్డికి కేటాయించాలని ఆయన వర్గీయులు ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా సికింద్రాబాద్‌ టిక్కెట్‌ బద్రీనాథ్‌కు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇక కాంగ్రెస్‌లో మెదక్‌ నుంచి విజయశాంతికి అసెంబ్లీ టిక్కెట్‌ కేటాయించారు. మొత్తానికి అన్ని పార్టీల్లోనూ అసమ్మత్తులు చెలరేగాయి. దీంతో బుజ్జగింపులు షరామామూలు అయ్యాయి. తీసుకున్న నిర్ణయానికి ఎవరు కూడా వెనక్కి తగ్లేదు. నామినేషన్ల దాఖలుకు ఒక్కరోజు మాత్రమే మిగిలివుండటంతో రాజకీయవాతావరణం వేడెక్కింది. తెలంగాణలో సీపీఐతో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్‌ 111 స్థానాలకు సోమవారం అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం లోక్‌సభ సీటును సీపీఐకి వదిలి మిగతా 16 స్థానాలకు అభ్యర్థులను ఖరారుచేసిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ఐకాస, ప్రజాసంఘాలు, విద్యార్థినేతలకు టికెట్లు ఇవ్వకపోవడంతో తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న పార్టీ అధిష్ఠానం మూడు స్థానాలకు అభ్యర్థులను మార్చి వీరికి కేటాయించేందుకు సమాలోచనలు చేస్తోంది. మరో ప్రధాన పక్షమైన తెలంగాణ రాష్ట్రసమితి 101 అసెంబ్లీ స్థానాలకు 16 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మల్కాజిగిరి స్థానానికి అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. భాజపాతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం ఇప్పటి వరకు 3 లోక్‌సభ, 27 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. పొత్తులో భాగంగా భాజపా 8 లోక్‌సభస్థానాలు, 47 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేయనుంది. తెలుగుదేశం పోటీచేసే మిగిలిన స్థానాల అభ్యర్థుల జాబితా ఇంకా విడుదల చేయలేదు. భాజపా కూడా జాబితాను ప్రకటించలేదు. దీంతో వివిధస్థానాల్లో టికెట్‌ ఆశిస్తున్న ఆశావహుల్లో ఒక్కసారిగా ఉత్కంఠ పెరిగిపోయింది. నామినేషన్ల దాఖలుకు రేపు ఒక్కరోజే మిగిలివుందని వారు పేర్కొన్నారు. మరో కీలకపార్టీ మజ్లిస్‌ తనకు పట్టున్న స్థానాల్లో అభ్యర్థులను ఇదివరకే ప్రకటించింది.