తెలంగాణలో ముగిసిన నామినేషన్ల ఘట్టం


మెదక్‌ బరిలో కేసీఆర్‌ శ్రీమహబూబ్‌నగర్‌లో జైపాల్‌ శ్రీజనగామలో పొన్నాల

అన్నిచోట్ల బహుముఖ పోటీ  శ్రీపలు చోట్ల అన్ని పార్టీలకు తప్పని రెబల్స్‌ బెడద

శ్రీనేడు పరిశీలన, 12న ఉప సంహరణ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9 (జనంసాక్షి) :

తెలంగాణలో నామినేషన్ల ఘట్టం ము గిసింది. 119 శాసనసభ, 17 లోక్‌ సభ స్థానాలకు భారీ సంఖ్యలో అభ్యరు ్థలు పోటీ చేశారు. గతంలో ఎన్నడూ లేనట్టుగా ఈసారి తెలంగాణలోని అ న్ని నియోజకవర్గాల్లో బహుముఖ పోటీ నెలకొంది. బుధవారం నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో నేతలు పెద్దసంఖ్యలో తమ శ్రేణులు, మద్దతుదారులతో తరలివచ్చి నామిన ేషన్లు వేశారు. నామినేషన్ల పరిశీలన గురువారం జరుగుతుంది. ఉపసం హరణకు 12 వరకు గడువు ఉంది. నామినేషన్ల దాఖలు సందర్భంగా చెదు రుముదరు ఘటనలు చోటుచేసుకు న్నాయి. పలుచోట్ల రెబల్స్‌ నామినేషన్లు వేశారు. కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ, టీఆర్‌ఎస్‌లకు రెబల్స్‌ బెడద తప్ప లేదు. నామినేషన్లు

వేసిన ప్రముఖుల్లో కెసిఆర్‌, జైపాల్‌ రెడ్డి, వివేక్‌, పొన్నాల, విజయశాంతి, కవిత,  కోమటిరెడ్డి బ్రదర్స్‌, కెటిఆర్‌, హరీష్‌ రావు తదితరులు ఉన్నారు.  మెదక్‌ లోక్‌సభ, గజ్వేల్‌ అసెంబ్లీ స్థానాలకు తెరాస అధినేత కేసీఆర్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. తెలంగాణ పీసీసీ అధినేత పొన్నాల లక్ష్మయ్య వరంగల్‌ జిల్లా జనగామ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గానాకి తన నామినేషన్‌ దాఖలు చేశారు. ఖమ్మం లోక్‌సభ స్థానానికి టిడిపి అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు నామినేషన్‌ దాఖలు చేశారు. నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గానికి టిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత నామినేషన్‌ దాఖలు చేశారు. అర్బన్‌ అసెంబ్లీ నియోజక వర్గానికి బీగాల గణెళిశ్‌ గుప్తా నామినేషన్‌ వేశారు.విజయశాంతి కాంగ్రెస్‌ అభ్యర్థిగా మెదక్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్‌ వేశారు. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు.  సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థిగా భాజపా తరఫున బండారు దత్తాత్రేయ, కాంగ్రెస్‌ నుంచి అంజన్‌ కుమార్‌ యాదవ్‌  హైదరాబాద్‌ కలెక్టరేట్‌లో నామినేషన్‌ దాఖలు చేశారు. కరీంనగర్‌ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్‌ నామినేషన్‌ వేశారు. సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గానికి తెరాస అభ్యర్థిగా కేటీఆర్‌ తన మద్దతుదారులతో కలిసి నామినేషన్‌ దాఖలు చేశారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ మంత్రి జానారెడ్డి నామినేషన్‌ వేశారు. నిజామాబాద్‌ గ్రావిూణ అసెంబ్లీ నియోజకవర్గానాకి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పీసీసీ మాజీ అధినేత డి. శ్రీనివాస్‌ నామినేషన్‌ వేశారు. సనత్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి తెదేపా అభ్యర్థిగా తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ నామినేషన్‌ వేశారు. కరీంనగర్‌ జిల్లా మంథని అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ మంత్రి శ్రీధర్‌బాబు నామినేషన్‌ దాఖలు చేశారు. కరీంనగర్‌ లోక్‌సభ భాజపా అభ్యర్థిగా సీహెచ్‌ విద్యాసాగర్‌ రావు నామినేషన్‌ వేశారు. ఆందోల్‌ అసెంబ్లీ నుంచి మాజీమంత్రి బాబూమోహన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. కరీంనగర్‌ లోక్‌సభ అభ్యర్థులుగా పొన్నం ప్రభాకర్‌(కాంగ్రెస్‌), బోయినపల్లి వినోద్‌కుమార్‌(టీఆర్‌ఎస్‌), సీహెచ్‌ విద్యాసాగర్‌రావు(బీజేపీ), విూసాల రాజారెడ్డి(వైసీపీ) నామినేషన్లు దాఖలు చేశారు. పెద్దపల్లి లోక్‌సభ అభ్యర్థులుగా జి. వివేక్‌(కాంగ్రెస్‌), బాల్కా సుమన్‌ (టీఆర్‌ఎస్‌), డాక్టర్‌ శరత్‌ (టీడీపీ) నామినేషన్లు దాఖలు చేశారు. ఆదిలాబాద్‌ లోక్‌సభ అభ్యర్థులుగా  నరేష్‌జాదవ్‌(కాంగ్రెస్‌), జి. నగేష్‌(టీఆర్‌ఎస్‌), రమేష్‌ రాథోడ్‌(టీడీపీ), ఆదె లీలారాణి(వైసీపీ) నామినేషన్లు దాఖలుచేశారు. నిజామాబాద్‌ లోక్‌సభ అభ్యర్థులుగా మధుయాష్కి (కాంగ్రెస్‌), కవిత (టీఆర్‌ఎస్‌), యెండల లక్ష్మీనారాయణ (బీజేపీ), ఎస్‌. రవీంద్రారెడ్డి(వైసీపీ) నామినేషన్లు దాఖలు చేశారు. జహీరాబాద్‌ లోక్‌సభ అభ్యర్థులుగా నామినేషన్‌ వేసిన సురేష్‌పట్కర్‌ (కాంగ్రెస్‌), బీవీపాటిల్‌(టీఆర్‌ఎస్‌), మదన్‌మోహన్‌రావు(టీడీపీ), ఎండీ మొహియుద్దీన్‌ (వైసీపీ) నామినేషన్లు దాఖలు చేశారు.మెదక్‌ లోక్‌సభ అభ్యర్థులుగా కేసీఆర్‌(టీఆర్‌ఎస్‌), శ్రవణ్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్‌),  చాగండ్ల నరేంద్రనాథ్‌(బీజేపీ), ప్రభుగౌడ్‌(వైసీపీ) నామినేషన్లు దాఖలు చేశారు. ఇంకా మల్కాజ్‌గిరి లోక్‌సభ అభ్యర్థులుగా నామినేషన్‌ వేసిన సర్వే సత్యనారాయణ(కాంగ్రెస్‌), మైనంపల్లి హన్మంతరావు(టీఆర్‌ఎస్‌), మల్లారెడ్డి(టీడీపీ), దినేష్‌రెడ్డి(వైసీపీ), జయప్రకాశ్‌నారాయణ (లోక్‌సత్తా), డా. నాగేశ్వర్‌(ఇండిపెండెంట్‌ గా) నామినేషన్లు దాఖలు చేశారు. చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థులుగా  పి. కార్తీక్‌రెడ్డి(కాంగ్రెస్‌), కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(టీఆర్‌ఎస్‌), తూళ్ల వీరేందర్‌గౌడ్‌(టీడీపీ), కొండా రాఘవరెడ్డి(వైసీపీ), ఏనుగు రామారావు(లోక్‌సత్తా) నామినేషన్లు దాఖలు చేశారు.హైదరాబాద్‌ లోక్‌సభ అభ్యర్థులుగా  సోమ కిషన్‌రెడ్డి(కాంగ్రెస్‌), రషీద్‌ షరీఫ్‌(టీఆర్‌ఎస్‌), భగవంత్‌రావు(బీజేపీ), అసదుద్దీన్‌ఓవైసీ(ఎంఐఎం), బోడ్డు సాయినాథ్‌రెడ్డి( వైసీపీ) నామినేషన్లు దాఖలు చేశారు. సికింద్రాబాద్‌ లోక్‌సభ అభ్యర్థులుగా  అంజన్‌కుమార్‌ యాదవ్‌(కాంగ్రెస్‌), భీమ్‌సేన్‌(టీఆర్‌ఎస్‌), బండారు దత్తాత్రేయ(బీజేపీ), రోహిత్‌కుమార్‌(లోక్‌సత్తా), కె. శ్రీనివాసులు (జేఎస్పీ) నామినేషన్లు దాఖలు చేశారు. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ అభ్యర్థులుగా జైపాల్‌రెడ్డి(కాంగ్రెస్‌), జితేందర్‌రెడ్డి(టీఆర్‌ఎస్‌), నాగం జనార్దన్‌రెడ్డి(బీజేపీ), అబ్దుల్‌ రహ్మాన్‌(వైసీపీ) నామినేషన్లు దాఖలు చేశారు. నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ అభ్యర్థులుగా నంది ఎల్లయ్య(కాంగ్రెస్‌), మందా జగన్నాథం(టీఆర్‌ఎస్‌), బి. నరసింహులు (టీడీపీ), జెట్టి ధర్మరాజు(వైసీపీ) నామినేషన్లు దాఖలు చేశారు. నల్గొండ లోక్‌సభ అభ్యర్థులుగా  గుత్తా సుఖేందర్‌రెడ్డి (కాంగ్రెస్‌), పల్లా రాజేశ్వర్‌రెడ్డి(టీఆర్‌ఎస్‌), తేరా చిన్నపరెడ్డి(టీడీపీ), గున్నం నాగిరెడ్డి(వైసీపీ), నంద్యాల నరసింహారెడ్డి (సీపీఎం) నామినేషన్లు దాఖలు చేశారు. భువనగిరి లోక్‌సభ అభ్యర్థులుగా  కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(కాంగ్రెస్‌), బూర నర్సయ్యగౌడ్‌(టీఆర్‌ఎస్‌), ఇంద్రసేనారెడ్డి(బీజేపీ), చెరుకుపల్లి సీతారాములు(సీపీఎం), జి. జనార్దన్‌రెడ్డి(జేఎస్పీ) నామినేషన్లు దాఖలు చేశారు.రంగల్‌ లోక్‌సభ అభ్యర్థులుగా  సిరిసిల్ల రాజయ్య(కాంగ్రెస్‌), కడియం శ్రీహరి(టీఆర్‌ఎస్‌), ఆర్‌.పరమేశ్వర్‌(బీజేపీ) నామినేషన్లు దాఖలు చేశారు. మహబూబాబాద్‌ లోక్‌సభ అభ్యర్థులుగా  బలరాంనాయక్‌ (కాంగ్రెస్‌), సీతారామనాయక్‌(టీఆర్‌ఎస్‌), మోహన్‌లాల్‌(టీడీపీ),రవీంద్రనాయక్‌(లోక్‌సత్తా), తెల్లం వెంకట్రావ్‌(వైసీపీ), బుక్యా లక్ష్మణ్‌ (న్యూ డెమోక్రసీ) నామినేషన్లు దాఖలు చేశారు.ఖమ్మం లోక్‌సభ అభ్యర్థులుగా నామా నాగేశ్వరరావు (టీడీపీ), బుడాన్‌ బేగ్‌షేక్‌(టీఆర్‌ఎస్‌), డా. నారాయణ(సీపీఐ), అప్రోజ్‌ సవిూనా(సీపీఎం), పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (వైసీపీ), సీహెచ్‌ నాగార్జునరావు(జేఎస్పీ) నామినేషన్లు దాఖలు చేశారు. హైదరాబాద్‌: గోషామహల్‌ ముఖేష్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ ప్రేమ్‌కుమార్‌, ఆది మహేందర్‌ తదితరులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరుకాక ఆయా జిల్లాల్లో పలువురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. లంగాణలో నామినేషన్ల పర్వం ముగిసింది. శాసన సభ, లోక్సభ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేయడానికి తుది గడువు బుధవారం మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. గురువారం  నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి ఆఖరు తేదీ ఏప్రిల్‌ 12. హైదరాబాద్‌ ఎంపీ స్థానానికి 11 నామినేషన్లు దాఖలు కాగా, సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి  27 మంది నామినేషన్లు వేశారు. చివరి రోజు పలు పార్టీల అగ్రనేతలు నామినేషన్లు దాఖలు చేశారు.

గతంలో ఎన్నడూ లేనంతగా అన్ని పార్టీలకు రెబల్స్‌ బెడద ఎక్కువగానే ఉంది. చివరికి ఉద్యమపార్టీ టిఆర్‌ఎస్‌కు కూడా రెబల్స్‌ తప్పలేదు.  దీంతో  అన్ని పార్టీలకు తిరుగుబాటు అభ్యర్థుల బెడద ఎక్కువగా ఉంది. అన్ని పార్టీలకు పలు ప్రాంతాలలో రెబల్‌ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్‌, టిడిపి, బిజెపిలకు పొత్తుల వల్ల కొన్ని స్థానాలు కోల్పోవడంతో తిరుగుబాటు అభ్యర్థులు ఎక్కువయ్యారు. టిఆర్‌ఎస్‌కు ఎవరితోనూ పొత్తులేకపోయినా దానికీ తిరుగుబాటు అభ్యర్థుల బెడద తప్పలేదు. టిఆర్‌ఎస్‌లో  కూడా సీట్ల కేటాయింపు విషయమై  తీవ్ర అసంతృప్తి నెలకొంది. కేసీఆర్‌ అభిమాన సంఘం అధ్యక్ష పదవికి వెంకటేశ్‌గౌడ్‌ రాజీనామా చేశారు. వరంగల్‌ జిల్లా పరకాలలో టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థిగా స్థానిక ఎమ్మెల్యే భిక్షపతి నామినేషన్‌ దాఖలు చేశారు. నల్లగొండ జిల్లా తుంగతుర్తిలో టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థిగా  సామ్యెలు నామినేషన్‌ దాఖలు చేశారు. ఎల్బీనగర్‌లో సత్యనారాయణ, నకిరేకల్లో రాజేశ్వరి బాలరాజు తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు.టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి టికెట్‌ ఆశించి భంగపడ్డ పలువురు నేతలు రెబల్‌ అభ్యర్థులుగా నామినేషన్‌ దాఖలు చేశారు. 119 నియోజకవర్గాలకు అభ్యర్థులను టీఆర్‌ఎస్‌ ఖరారు చేసింది. అయితే వాటిలో 109 స్థానాలకు బహిరంగంగా అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్‌ పార్టీ మిగిలిన 10 స్థానాలకు రహస్యంగా అభ్యర్థులను పిలిచి బీఫాంలు అందజేసింది. దీంతో ఆయా స్థానాల్లో టికెట్‌ ఆశించిన పలువురు నేతలు రెబల్‌ అభ్యర్థులుగా నామినేషన్‌ వేసినట్లు సమాచారం. ఇక టిడిపిలో పొత్తుల కారణంగా అసంతృప్తులు బయటపడ్డాయి. ఎల్బీనగర్‌ టీడీపీ టికెట్‌ ఆర్‌.కృష్ణయ్యకు  కేటాయించడంతో టిడిపి నేతలు తిగురుబాటు చేశారు. ఎల్బీనగర్‌ టిడిపి ఇన్‌చార్జి కృష్ణప్రసాద్‌ పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్‌ దాఖలు చేశారు. ఎల్బి నగర్‌ స్థానానికే టీడీపీ నేత సామరంగారెడ్డి కూడా స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్‌ దాఖలు చేశారు.  ఖైరతాబాద్‌ స్థానానికి టీడీపీ రెబల్‌ అభ్యర్ధిగా లంకల దీపక్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. టీడీపీకి రాజీనామా చేసిన పి.ఎల్‌.శ్రీనివాస్‌ తిరుగుబాటు అభ్యర్థిగా సికింద్రాబాద్‌ శాసనసభ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేశారు. కరీంనగర్లో  టీడీపీ  రెబల్‌ అభ్యర్థిగా   గుర్రం వెంకటేశ్వర్లు నామినేషన్‌ వేశారు. కాంగ్రెస్‌లోనూ రెబల్స్‌ ఎక్కువగానే ఉన్నారు. కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లి అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థిగా గీట్ల ముకుందరెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. హుజురాబాద్‌ కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థిగా పరిపాటి రవీందర్‌రెడ్డి నామినేషన్‌ వేశారు. కరీంనగర్లో కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థిగా జువ్వాడి నరసింగరావు నామినేషన్‌ వేశారు. సీపీఐకి  కేటాయించిన మహేశ్వరం అసెంబ్లీ స్థానానికి మల్‌రెడ్డి రంగారెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. మాజీ మంత్రి సబిత సహకారంతో మల్‌రెడ్డి నామినేషన్‌ వేసినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థిగా  డీసీసీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్ధిగా కృష్ణారావు నామినేషన్‌ దాఖలు చేశారు. వికారాబాద్‌ కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థిగా మాజీ మంత్రి చంద్రశేఖర్‌, చేవెళ్ల కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థిగా వెంకటస్వామి నామినేషన్‌ దాఖలు చేశారు.  మునుగోడులో ఎంపీ పాల్వాయి కూతురు స్రవంతి  రెబల్‌గా బరిలో దిగారు.  దేవరకొండలో  ఎమ్మెల్యే బాలూ నాయక్‌ రెబల్‌గా బరిలో దిగారు. మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్‌ రెబల్‌గా నామినేషన్‌ వేశారు. వరంగల్‌ జిల్లా నర్సంపేటలో కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థిగా డీసీసీ అధ్యక్షుడు మాధవరెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు.సూర్యాపేటలో బీజేపీ రెబల్‌ అభ్యర్థిగా సంకినేని వెంకటేశ్వర రావు నామినేషన్‌ వేశారు. ఇబ్రహీంపట్నంలో బీజేపీ రెబల్‌గా అర్జున్‌రెడ్డి  బరిలోకి దిగారు. కరీంనగర్‌ అసెంబ్లీ స్థానానికి బీజేపీ రెబల్‌ అభ్యర్థిగా డాక్టర్‌ విజయేందర్‌రెడ్డి నామినేషన్‌ వేశారు. మెదక్‌ జిల్లా పటాన్‌చెరు అసెంబ్లీ స్థానానికి బీజేపీ రెబల్‌ అభ్యర్థిగా అంజిరెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. తెలంగాణ ఏర్పాటులో మొదటి త్యాగం అమరవీరులదైతే రెండో త్యాగం సోనియా గాంధీదని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. సోనియాను తెలంగాణ కోసం ఒప్పించడంలో తాను కీలక భూమిక పోషించానని అన్నారు. తాను తెరవెనుక నిర్వహించిన పాత్ర అసామాన్యన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించానని జైపాల్‌రెడ్డి చెప్పారు. బుధవారం ఆయన మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేయడానికి కలెక్టరేట్‌కు వచ్చారు. నామినేషన్‌ దాఖలు అనంతరం మాట్లాడుతూ తన రాజకీయ శేష జీవితాన్ని పాలమూరులో గడిపేందుకే వచ్చానని తెలిపారు. 45ఏళ్ల రాజకీయ జీవితంలో 30 ఏళ్లు జిల్లాలోనే వివిధ పదవులను చేపట్టి జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించానన్నారు. తెలంగాణ పోరాటంలో ఎందరో ముందుండి నడిచారని అయితే కాంగ్రెస్‌ తీసుకున్న నిర్ణయం వల్లనే తెలంగాణ ఏర్పాటు సాకారమయ్యిందన్నారు. ఇందులో  సోనియా నిర్ణయమే కీలకమన్నారు. ఆమె నిర్ణయం తీసుకుని ఉండకపోతే తెలంగాణ వచ్చేది కాదన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ చరిత్రలో నిలిచి పోతుందన్నారు.