మహంతి పదవీకాలం పొడిగింపు సరైనదే


గవర్నర్‌కు ఆ అధికారం ఉంది : హైకోర్టు
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9 (జనంసాక్షి) :
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి పదవీకాలం పొడిగింపు సరైనదేనని, రాజ్యాంగ విరుద్దం కాదని హైకోర్టు ధర్మాసనం ప్రకటించింది. గవర్నర్‌ సీఎస్‌ పదవీకాలాన్ని పొడిగించడం సబబేనని ధర్మాసనం వెల్లడించింది. పదవి పొడింగించే విచక్షణాదికారం గవరన్నర్‌కు ఉందని కోర్టు సమర్థించింది. దీంతో  ప్రభుత్వానికి ఊరట లభించింది.  మహంతి పదవీకాలం పొడిగింపు సబబే అని హైకోర్టు తీర్పునివ్వడంతో మరో మూడు నెలల పదవీకాలం పొడిగించాలన్న నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. మహంతి పదవీ కాలాన్ని పొడిగించే విచక్షణాధికారం గవర్నర్‌కు ఉందని కోర్టు పేర్కొంది. పదవీకాలం పొడిగింపు రాజ్యాంగ విరుద్ధం కాబోదని హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. మహంతి పదవీ కాలం పొడిగింపు రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన విషయం విదితమే. ఆయన పదవీకాలం మే 31తో ముగియనుంది.