పోటెత్తిన పరిషత్ పోలింగ్
ఏడు చోట్ల రీపోలింగ్
అంతా ప్రశాంతం : రమాకాంత్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 11 (జనంసాక్షి) :
జిల్లా పరిషత్, మండల పరిషత్ తుది విడత పోలింగ్ శుక్రవారం ప్ర శాంతంగా ముగిసింది. స్వల్ప సంఘటనలు మినహా ఎన్నికలు ప్ర శాంతంగా ముగిసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన బుద్ధభవన్‌లో మీడి యాతో మాట్లాడారు. తుది విడతలో 80 శాతానికి పైగా పోలింగ్ న మోదైనట్లు చెప్పారు. ఏడు కేంద్రాల్లో ఆదివారం రీ పోలింగ్ నిర్వ హిస్తామని చెప్పారు. బూసికట్టులో మాత్రం ఈనెల 16న రీపోలింగ్ ఉంటుందని ఆయన వెల్లడించారు. మధ్యాహ్నం మూడు గంటలకు దాదాపు 70 శాతం పోలింగ్ నమోదైనట్లు సమాచారం. కృష్ణా జిల్లా లో 74, చిత్తూరు జిల్లాలో 72.33, శ్రీకాకుళం జిల్లాలో 68.5, వ రంగల్ జిల్లాలో 73.49, కరీంనగర్ జిల్లాలో 69, పశ్చిమగోదావరి జిల్లాలో 71, నిజామాబాద్ జిల్లాలో 68శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. కడపలో కూడా అత్యధికంగా 73 శాతం పోలింగ్ నమోదైనట్లు సమాచారం. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మం డలం తురకపాలెంలో పరిషత్ ఎన్నికల సందర్భంగా వివాదం చెలరే గింది. దాంతో వైకాపా కార్యకర్త ఒకరు బ్యాలట్ బాక్సులో నీళ్లుపో యగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలింగ్ జరు గుతున్న పలుచోట్ల రకరకాల వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం జివ్విగుంటలో ఏజెంట్లే ఘర్ష ణకు దిగగా నలుగురికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. సిబ్బంది వారిని ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఎర్రగుంట్ల మండలం పెదనపాడు గ్రామంలో తెదేపా కార్యకర్తలపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో టిడిపి కార్యకర్త ఒకరు తీవ్రంగా గాయ పడ్డాడు. ఓట్లు సర్దుబాటు చేసుకుందామని వైకాపా కార్యకర్తలు అడ గగా అందుకు టిడిపి కార్యకర్తలు ఒప్పుకోకపోవడంతో దాడి చేసి నట్లు బాధితులు తెలిపారు. క్షతగాత్రుడిని ప్రొద్దుటూరు ప్రభు త్వాసు పత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకోవడంతో ప రిస్థితి సద్దుమణిగింది. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం గ్రం థసిరి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సిబ్బంది పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ తెదేపా కార్యకర్తలు ఆం దోళన చేపట్టారు. ఈ విషయమై పోలింగ్ కేంద్రం వద్ద తెదేపా, వైకా పా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. టిడిపి నాయకుడు రాజన్‌బాబును పోలీసులు అదుపులోకి
తీసుకున్నారు. దీంతో రాజన్‌బాబును వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు అక్రమంగా తమ కార్యకర్తలపై దాడులు నిర్వహించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వారు నినాదాలు చేశారు. పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న పోలీసులను విధుల నుంచి తప్పించాలని వారు ఆందోళన చేపట్టారు. ఎస్‌ఐ హుటాహుటిన గ్రామానికి చేరుకొని ఆందోళన చేస్తున్న కార్యకర్తలతో మాట్లాడి వారిని శాంతింప చేశారు. కొన్నిచోట్ల బ్యాలెట్ పత్రాలు తారుమారైనట్లు ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి తెలిపారు. చిన్న చిన్న ఘర్షణల విషయంలో తాము జోక్యం చేసుకోబోమని ఆయన చెప్పారు .సాయంత్రం 5 గంటల వరకు అన్నిచోట్లా పోలింగ్ జరుగుతుందని, అందరూ సమైక్యంగా కృషి చేయడం వల్లే ఈసారి పోలింగ్ శాతం పెరిగిందని ఆయన అన్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ నిలిచిపోయింది. స్వతంత్ర అభ్యర్థికి హస్తం గుర్తు కేటాయించడంపై మిగిలిన సభ్యులు అభ్యంతరం తెలపడంతో అధికారులు పోలింగ్ నిలిపి వేశారు. ఖమ్మంజిల్లా వైరాలో పలు కేంద్రాల్లో పోలింగ్ నిలిచిపోయింది. ఓటరు స్లిప్పులు పంపిణీ చేయకపోవడంతో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోలేక పోతున్నారు. ఓటరు స్లిసిప్పులు పంపిణీ చేస్తున్న రాజకీయపార్టీలను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. అలాగే తల్లాడ మండలం కలకుడిమి పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ పత్రాలు తారుమారు కావడంతో పోలింగ్ నిలిపివేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. కలకుడిమి పోలింగ్ కేంద్రానికి తల్లాడ మండలంలోని వెంగన్నపేటకు చెందిన బ్యాలెట్ పత్రాలు చేరాయి. 50మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత గుర్తించిన అధికారులు వెంటనే పోలింగ్ నిలిపివేశారు.అనంతపురం జిల్లా శింగనమల మండలం బండవిూదిపల్లిలో రీపోలింగ్‌కు ఈసీ ఆదేశించింది. శింగనమల జడ్పీటీసీ స్థానానికి ఆత్మకూరు బ్యాలెట్ పేపర్లు రావడంతో పోలింగ్ నిలిపివేశారు. పోలింగ్ అధికారుల విజ్ఞప్తి మేరకు ఈసీ రీపోలింగ్‌కు ఆదేశాలు జారీ చేసింది. వరంగల్ జిల్లా హాసన్‌పర్తి మండలం గుంటురుప్లలె పోలింగ్ కేంద్రం వద్ద ఓటరుపై పోలీసులు చేయి చేసుకున్నారు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద గ్రామస్థులు ఆందోళనకు దిగడంతో పరిస్తితి ఉద్రిక్తంగా మారింది. ప్రకాశంజిల్లా పొన్నలూరు మండలం సుంకిరెడ్డిపల్లిలో వైకాపా నేతలు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. అభ్యర్థులు, ఏజెంట్లను లోపలికి రానీయకుండా సర్పంచి అడ్డుకున్నారు. అధికారులతో వైకాపా నేతలు కుమ్మక్కయ్యారని, పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరుగుతోందని తెదేపా నేతలు ఆందోళకు దిగారు. వైకాపా నేత వై.ఎస్ కొండారెడ్డిని కడప జిల్లా ఇడుపులపాయలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొండారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.