బర్త్‌డే పార్టీ పేరుతో పంపకానికి తాయిలాలు


దాడి చేసి పట్టుకున్న అధికారులు
తప్పించుకున్న ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 12 (జనంసాక్షి) :
భార్య బర్త్‌డే పార్టీ పేరుతో మెదక్‌ జిల్లా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నా నికి ఒడిగట్టాడు. నగరంలోని ఓ పార్కులో ఓటర్ల కు సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ ఉప కరణాలు తాయిలా లుగా ఇస్తుండగా అధికారులు దాడి చేసి పట్టుకు న్నారు. అయితే ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి మాత్రం తప్పించుకున్నారు. ఎన్నికల వేల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి భార్య పుట్టినరోజు వేడుక పేరుతో జగ్గారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ వేశారు. అందుకు మెరుగైన సమాజం కోసం అంటూ పొద్దస్తమానం ఊదరగొట్టే ఓ ఎలక్ట్రానిక్‌ మీడియా చానెల్‌ వాహనాన్ని ఎంచుకున్నారు. అందులో సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు ఉంచి నగరంలోని ఓ రాక్‌ గార్డెన్‌కు తరలించారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లోని సదరు రాక్‌ గార్డెన్‌ ఉప్పల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డిదిగా అధికారులు గుర్తించారు. ముందస్తుగానే ఓటర్ల జాబితా సిద్ధం చేసి వారిని పుట్టిన రోజు వేడుకలకు ఆహ్వానించారు. వారికి సెల్‌ఫోన్లతో పాటు కుక్కర్లు ఇతర ఉపకరణాలు పంపిణీకి సన్నద్ధమయ్యారు. సమాచారాన్ని తెలంగాణ ప్రాంత మీడియా చానెళ్ల ప్రతినిధులు ఎన్నికల అధికారులకు అందించగా వారు పోలీసులతో కలిసి దాడి చేసి భారీ సంఖ్యలో సెల్‌ఫోన్లు, రైస్‌ కుక్కర్లు, స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే అనుచరులు ఐదుగురితో పాటు సదరు మీడియా చానెల్‌ ఉద్యోగిపై కేసు నమోదు చేశారు.