బంగారు తెలంగాణే లక్ష్యం
పగటి పూట ఉచిత విద్యుత్
అమరవీరుల కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం
తెలంగాణ ఆవిర్భావం రోజు అమరవీమరుల దినోత్సవం
వంద కోట్లతో జయశంకర్ మెమోరియల్ ట్రస్ట్
మైనార్టీ సబ్ ప్లాన్, యువతకు లక్ష ఉద్యోగాలు
కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
హైదరాబాద్, ఏప్రిల్ 12 (జనంసాక్షి) :బంగారు తెలంగాణ ఏర్పాటే తమ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. రైతులకు పగటి పూట ఏడు గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తామని, తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న అమ రవీరుల కుటుంబాలకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని తెలిపింది. వంద కోట్లతో జయశంకర్ మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని, మైనార్టీల కోసం సబ్‌ప్లాన్, యువతకు తొలి ఏడాదిలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పింది. శనివారం గాంధీభవన్‌లో టీపీసీసీ మేనిఫెస్టోను అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కేంద్ర మంత్రి జైరామ్ రమేశ్ విడుదల చేశారు. కార్యక్రమంలో దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. మేనిఫెస్టోలో నిరుద్యోగులకు లక్ష ప్రభు త్వ ఉద్యోగాలిస్తామని వరాలు జల్లు కురిపించారు. అమరుల కుటుంబాలను ఆదు కోవడం, యువతకు ఉద్యోగాల కల్పన, ప్రాజెక్టుల పూర్తి వంటి వాటికి ఇందులో ప్రధాన్యం కల్పించారు. పగటి పూట కూడా వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ సరఫరా చేస్తామని రైతులకు హావిూచ్చారు. అధికారంలోకి రాగానే మైనార్టీలకు సబ్‌ప్లాన్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మైనార్టీల సమస్యలపై ప్రత్యేక కమి టీని వేస్తామని చెప్పారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కొనసాగిస్తామని తెలి పారు. ఇక ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి ఏడాదిలోనే తెలంగాణాలో నిరుద్యో గలుకు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మూడేళ్లలో జిల్లాకు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. జూన్ 2న తెలంగాణ అమరవీరుల దినోత్సవంగా గుర్తింపు, అమరవీరుల కోసం జయశంకర్ ట్రస్ట్ ఏర్పాటు, చిన్న, సన్నకారు రైతులకు ఎకరాకు రూ. 10 వేల చొప్పున
పోత్సాహ్రకం, రూ. 500 కోట్ల నిధులతో యువతకు ప్రత్యేక బ్యాంక్, మహిళా సంఘాలకు రూ. లక్ష చొప్పున ప్రోత్సాహకం, సోలార్ విద్యుత్ వినియోగానికి ప్రాధాన్యత వంటి అంశాలను ప్రముఖంగా చేర్చారు. అలాగే ప్రతి రెవెన్యూ డివిజన్‌లో ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలు ఏర్పాటు, ఆరోగ్య శ్రీ తరహాలో మరింత పారదర్శకంగా ఆరోగ్య విధానం అమలు చేస్తామని ప్రకటించారు. ప్రాణహిత – చేవెళ్ల, పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ ¬దా, నల్లగొండ – ఖమ్మం సరిహద్దులో వెయ్యి ఎకరాల్లో పారిశ్రామిక జోన్ ఏర్పాటు, సాంకేతిక విద్యార్థులకు ఉపాధి లభించే విధంగా శిక్షణ కార్యక్రమాల అమలు చేసి తీరుతామన్నారు. ఇక విభజన ప్రకియ డెడ్‌లైన్‌లోపే పూర్తి కానుందని కేంద్రమంత్రి జైరాం రమేష్ తెలిపారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చట్ట ప్రకారమే ఉద్యోగుల విభజన జరుగుతుందని తెలిపారు. ఉద్యోగులను మూడు భాగాలుగా విభజిస్తున్నామని.. లోకల్, డిస్ట్రిక్ట్, స్టేట్ ఎంప్లాయీస్‌గా ఉద్యోగుల విభజన జరుగుతుందని పేర్కొన్నారు. 21 కమిటీల ఆధ్వర్యంలో విభజన పక్రియ జరుగుతోందన్నారు. జూన్ 30 నాటికి అన్ని కమిటీలు విభజనపై నివేదికలు అందజేస్తాయని.. పెన్షనర్ల విభజన దాదాపు పూర్తయినట్లేనని వెల్లడించారు. జేహెచ్‌ఎంసీ పరిధి ఉమ్మడి రాజధానిగా ఉంటుందని ప్రకటించారు. కాంగ్రెస్‌తోనే ముస్లింలకు న్యాయం జరుగుతదని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్సేనని గుర్తు చేశారు. అధికారంలోకి వస్తే ముస్లింల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు.