వరుణ్ తమ్ముడే.. దారి తప్పాడు
సుల్తాన్‌పూర్ ప్రజలు దారిలో పెట్టాలి : ప్రియాంక
అమేథి, ఏప్రిల్ 13 (జనంసాక్షి) :బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీ తన తమ్ము డేకాని దారి తప్పాడని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రి యాంక అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథిలో గల మున్షిగంజ్ గెస్ట్‌హౌస్‌లో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొని మా ట్లాడారు. సుల్తాన్‌పూర్ నియోజకవర్గం ఓటర్లు తమ్ముడు వరుణ్‌ను దారిలో పెట్టాలని, అతడికి వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. వరుణ్‌గాం ధీ తమ కటుంబంలో సభ్యుడే అయినా తప్పుడు దారిలో వెళ్తుంటే పెద్దవాళ్లు సరిచేయాలని అన్నారు. సుల్తాన్‌పూర్ ప్రజలే వరుణ్‌ను సరైన మార్గంలో పెట్ట గలరని ప్రియాంక విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్‌గాంధీ తరపున మాత్రమే తాను ప్రచారం నిర్వహి స్తానని, మిగతా నియోజకవర్గాల ప్రచార బాధ్యతల జోలికి వెళ్లబోనని ఆమె తేల్చిచెప్పారు. దేశంలో స్థిరమైన ప్రభుత్వం,
లౌకికవాద ప్రభుత్వం ఉండాలంటే కాంగ్రెస్‌కే పట్టం కట్టాలని ప్రజలను కోరారు. ప్రియాంక వ్యాఖ్యలపై వరుణ్‌గాంధీ తల్లి బీజేపీ ఎంపీ మేనకాగాంధీ స్పందించారు. దేశానికి సేవ చేయకుండా కాంగ్రెస్సే దారి తప్పిందని తిప్పికొట్టారు. ఎవరు దారి తప్పారు, ఎవరు సరైన దారిలో వెళ్తున్నారో త్వరలో జరుగబోయే ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తామని ఆమె వ్యాఖ్యానించారు.