కేసీఆర్ కుటుంబం కోసం కాదు తెలంగాణ : జైరామ్ రమేశ్
వరంగల్, ఏప్రిల్ 19 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్రసమితి అధ్యక్షుడు కేసీఆర్ కుటుంబం కో సం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేదని కేంద్ర మంత్రి జైరామ్ రమేశ్ అన్నారు. తెలంగాణ ఇచ్చింది కు టుంబపాలన కోసం కాదని ఆయన కేసీఆర్‌ను ఉద్దేశించి ఘాటైన విమర్శలు చేశారు. సామాజిక న్యాయం కోసమే తెలంగాణ ఇచ్చామని స్పష్టం చేశారు. తెలంగాణలో మొట్ట మొదటి సీఎం కాంగ్రెస్ అభ్యర్థేనని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఆయన తెలంగాణలో మొట్టమొదటి సీఎం కాంగ్రెస్ అభ్యర్థేనని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ పెద్దన్నగా వ్యవహరించి నిర్ణయం తీసుకుందన్నారు. మేడమ్ సోనియా ధృడనిర్ణయంతోనే తెలంగాణ కల సాకారమయ్యిందని వరంగల్‌లో మీడియా సమావేశంలో అన్నారు. కేంద్ర మంత్రి జైరామ్ రమేశ్ శనివారం జిల్లాలో పర్యటించారు. డీసీసీ అధ్యక్షుడి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తరువాత జిల్లాలోని లోక్‌సభ, శాసనసభ స్థానాల్లోని కాంగ్రెస్ అభ్యర్థులతో భేటీ అయ్యారు. ఆయా నియోజకవర్గాల్లో తాజా పరిస్థితిపై సవిూక్ష జరిపారు. బంగారు తెలంగాణగా రూపుదిద్దడానికి తమకు అందరి మద్దతు కావాలని ఆయన అన్నారు కాంగ్రెసు స్వాతంత్య్రం తెచ్చింది, తెలంగాణ ఇచ్చిందని ఆయన అన్నారు. రెచ్చగొట్టడమే తెలంగాణ రాష్ట్ర సమితి అజెండా అని ఆరోపించారు. ఆ పార్టీకి రెచ్చగొట్టడం మినహా మరొకటి తెలియదని వ్యాఖ్యానించారు. అభివృద్ధి కొనసాగాలంటే కొత్త ఆంధప్రదేశ్ పురోగతి చెందాలన్నా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తప్పనిసరి అని అన్నారు. ఆంధ్రలోనూ కాంగ్రెస్ అధికారంలోకి రావడం అవసరమేగానీ తొలి ఆవశ్యకత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకావడమేనని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ కాకుండా మరే ప్రభుత్వం వచ్చినా బ్లాక్‌మెయిల్ చేయడం, రెచ్చగొట్టడానికి తోడు కొత్త సమస్యలు సృష్టించే అవకాశముందని ప్రజలను హెచ్చరించారు. ఒక్క కాంగ్రెస్ మాత్రమే రెండు రాష్టాల్రు ప్రశాంతంగా కలిసి జీవించే విధంగా చూడడంతోపాటు పురోగతిని ముందుకు తీసుకెళ్లగలదని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని జైరామ్ చెప్పారు. ఇదిలావుంటే కెసిఆర్‌పై పొన్నాల మరోమారు ఫైర్ అయ్యారు. సెటిలర్ల ఓట్ల కోసం తామెప్పుడూ వెంపర్లాడలేదని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి అనుమానాలు రేకెత్తించింది కేసీఆరేనని సెటిలర్లకు అభద్రతాభావం కల్పించిన కేసీఆర్ క్షమాపణ చెప్పాలని పొన్నాల డిమాండ్ చేశారు. అభద్రతా భావం కల్పిస్తున్న కెసిఆర్ సెటిలర్లకు క్షమాపణ చెప్పాలని పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి అనుమానాలు రేకెత్తించింది కెసిఆరేనని ఆయన అన్నారు. సెటిలర్ల ఓట్లు పడవనే నైరాశ్యంలో కేసీఆర్ ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. భౌగోళిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే సోనియా, రాహుల్ గాంధీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెసు పార్టీయేనని, ప్రజల మద్దతు తమ పార్టీకే ఉందని ఆయన అన్నారు. తెలంగాణలో సెటిలర్ల ఓట్ల కోసం తమ పార్టీ ఎప్పుడూ వెంపర్లాడలేదని ఆయన స్పష్టం చేశారు తెలంగాణ ఉద్యమం పేరుతో ఆందోళనకరమైన పరిస్థితులు కల్పించి రాష్టాన్రికి పెట్టుబడులు రాకుండా అడ్డుకుంది. కాంగ్రెస్ పార్టీ కంటే వ్యక్తులు ముఖ్యం కాదని కేంద్రమంత్రి జైరాం రమేశ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లినవారిని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకోబోమని అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్‌ను వీడిన వారిని పార్టీలోకి మళ్లీ ఆహ్వానించేది లేదని స్పష్టం చేశారు. పార్టీలోకి ఇష్టమొచ్చినప్పుడు రావడానికి ఇదేమైనా రైల్వే ఫ్లాట్‌ఫామా అని ప్రశ్నించారు. నర్సంపేట కాంగ్రెస్ అభ్యర్థిని సోనియా నిర్ణయించిన వ్యక్తేనని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తెలిపి పోటీ చేయొద్దన్ని చెప్పినా వినకుండా పసోటీకి దిగిన దొంతి మాధవరెడ్డి తీరును ఆయన తప్పుపట్టారు. చివరి నిమిషంలో నర్సంపేట అసెంబ్లీ స్థానాన్ని దొంతి మాధవరెడ్డికి కాదని జేఏసీ నేత కత్తి వెంకటస్వామికి కేటాయించిన విషయం విదితమే. దొంతి మాధవరెడ్డి రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. దీంతో కాంగ్రెస్ నిర్ణయించిన వ్యక్తికే ఓటేయాలన్నారు.