రెచ్చగొడితే చర్యలు తప్పవు : డీజీపీ


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 (జనంసాక్షి) :
సార్వత్రిక ఎన్నికల సందర్భం గా ఎవరైనా రెచ్చగొట్టే చర్య లకు పాల్పడితే చర్యలు తప్ప వంటూ డీజీపీ ప్రసాదరావు హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఎన్నిక లు పోలీసులకు సవాలే అని డీజీప తెలిపారు. రాష్ట్రంలో మావోల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతను ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం వారి ప్రభావం లేదని, అయినా ఏమరుపాటు లేకుండా భద్రతను కట్టుది ట్టం చేశామన్నారు. ఆంధప్రదేశ్‌ జర్నలిస్టు ఫోరం నిర్వ హించిన మీట్‌ ది ప్రెస్‌లో డీజీపీ మాట్లాడారు. వరుసగా ఎన్నికలు జరుగుతున్నప్పటికీ సమన్వయంతో కలిసి పని చేస్తున్నామని చెప్పారు. ఎన్నికలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తున్నామని పేర్కొన్నారు.ఎన్నికలప్పుడు మా వోయిస్టులు బహిష్కరణ పిలుపివ్వడం సాధారణమేనని అన్నారు. మావోయిస్టులు ఎన్నికల పోలింగ్‌ను అడ్డుకునే ప్రమాదం ఉందన్నారు. మావోల కదలికలపై నిఘా పెట్టామన్నారు. ఎస్పీల నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల్లో
హెలికాప్టర్లను వినియోగిస్తామని వెల్లడించారు. మొదటి దశ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. పోలీసులు అతిగా ప్రవర్తిస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యక్తులను, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. వివాదాస్పద ప్రసంగాలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునివ్వడం సాధారణమే అని చెప్పారు. సార్వత్రిక ఎన్నికలు సజావుగా జరిగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని ప్రసాదరావు హెచ్చరించారు. ఎన్నికలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తామన్నారు. సరిహద్దు, సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా దళాలను మోహరించినట్లు చెప్పారు. వరుస ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.