నేడు తెలంగాణలో రాహుల్ పర్యటన
హైదరాబాద్, వరంగల్‌లో భారీ బహిరంగ సభలు
హైదరాబాద్, ఏప్రిల్ 24 (జనంసాక్షి) :
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ శుక్రవారం రెండోసారి తెలం గాణలో పర్యటించనున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆయన ఇక్కడ పర్యటించడం ఇది రెండోసారి. రాహుల్‌గాంధీ మలివిడత ప్రచారంలో పాల్గొననున్నారు. గురువారం మధ్యాహ్నం వరంగల్ జిల్లా మడికొండలో నిర్వ హించే ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 5.15 గం. కు ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించి పొన్నాల, దిగ్విజయ్‌సింగ్ ఏ ర్పాట్లను పర్యవేక్షించారు. రాహుల్ సభలకు భారీగా జనాన్ని సమీకరిం చను న్నారు. రాహుల్ పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మడికొండలోని సెయింట్ పాల్స్ స్కూల్ మైదానంలో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఆధ్వర్యంలో భద్రత ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర అదనపు డీజీపీ సుదీప్ లకాటియా, ఇంటెలిజెన్స్ ఐజీ మహేశ్ భగవత్ గురువారం సభాస్థలిని పరిశీలించారు. ఆరుగురు డీఎస్పీలు, 24 మంది ఇన్‌స్పెక్టర్లు, 75 మంది ఎస్సైలు, 110 మంది ఏఎస్సైలు, 381 మంది హెడ్‌కానిస్టేబుల్స్ (మేల్), 48 మంది కానిస్టేబుల్స్ (ఫిమేల్), 217 మంది హోంగార్డులు, మూడు స్పెషల్ పార్టీలు, 15 బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.