ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి దుర్మరణం


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 24 (జనంసాక్షి)
వైఎస్సార్‌సీపీ నాయకురాలు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి దుర్మర ణం చెందారు. బుధవారం జరిగిన రో డ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె హైదరాబాద్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉద యం 11.05 గంటలకు కన్నుమూ శారు. శోభానాగిరెడ్డి ప్రస్తుతం ఆళ్లగడ్డ నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేస్తున్నా రు. పోటీలో ఉన్న అభ్యర్థి మృతి చెందిన నేపథ్యంలో ఆళ్లగడ్డ ఎన్నిక వాయిదా పడే అవ కాశం ఉందని రాజకీయ నిపుణులు పేర్కొం టున్నారు. కర్నూలు జిల్లాలోని నంద్యాలలో బుధవారం రాత్రి షర్మిల నిర్వహించిన రోడ్‌షో కు హాజరై తిరిగి ఆళ్లగడ్డకు వస్తుండగా శోభ ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి బోల్తా పడడంతో తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డుపై ఉన్న ధాన్యం కుప్పలను గమనించని డ్రైవర్‌ వాటి దగ్గరకు వచ్చాక సడెన్‌గా బ్రేకులు వేయడంతో వాహనం అదుపు తప్పి నాలుగు పల్టీలు కొట్టి పోలాల్లోకి దూసుకెళ్లింది. శోభా నాగిరెడ్డితో పాటు డ్రైవర్‌ తీవ్రంగా గాయ పడ్డారు. హుటాహుటిన వారిని నంధ్యాలలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా, అక్కడ ప్రాథ మిక చికిత్స చేసి కర్నూలు, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని కేర్‌ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన
శోభానాగిరెడ్డిని బతికిం చేందుకు కేర్‌ ఆస్పత్రి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. శోభా మృతితో కుటుంబ సభ్యులతో పాటు వైఎస్సార్‌సీపీ నేతలు, పార్టీ శ్రేణులు, అభిమానులు దిగ్భాంతికి గురయ్యారు. ఆమె పార్థివ దేహాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో రాజకీయ నాయకులు, అభిమానులు కేర్‌ ఆస్పత్రికి తరలివచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం ఆళ్లగడ్డలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రకటించారు.
తీవ్ర గాయాలతోనే మృతి..
వాహనం నాలుగుసార్లు బోల్తా కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఎడమ వైపున ఉండే ఏడు పక్కటెముకలు విరిగి గుండెకు తగలడం, తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అంతర్గతంగా రక్తస్రావం కావడం, తలలో రక్తం గడ్డ కట్టడంతో కోమాలోకి వెళ్లిపోయారు. ఊపిరి తీసుకొనేందుకు కూడా వీలు కాలేదు. దీంతో ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. శోభను బతికించేందుకు కేర్‌ వైద్యుల బృందం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. డాక్టర్‌ సోమరాజు నేతృత్వంలోని ఏడుగురు ప్రత్యేక వైద్యుల బృందం తీవ్రంగా శ్రమించిన ఫలితం లేకపోయింది. మెరుగైన వైద్యం కోసం ఎయిర్‌ అంబులెన్స్‌ ద్వారా ఆమెను బెంగళూరు, లేదా సింగ పూర్‌ తీసుకెళ్లాలని భావించినప్పటికీ, ఫలితం లేకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. దాదాపు ఐదు గంటల పాటు ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో చికిత్స అందించినప్పటికీ ఎలాంటి పురోగతి కనిపించలేదు. చికిత్సకు ఆమె శరీరం స్పందించక పోవడం, ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో 11.05 గంటలకు శోభానాగిరెడ్డి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తొలి నుంచి ప్రజా సేవకే అంకితమైన శోభానాగిరెడ్డి మృతి చెందిన తర్వాత కూడా జనానికి ఉపయోగపడే గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఆమె తన కళ్లను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. పుట్టెడు దుఃఖంలోనూ ఆమె కుటుంబ సభ్యులు శోభ కళ్లను ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రికి దానం చేశారు.
కీలక నేతగా గుర్తింపు..
రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన శోభ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కర్నూలు జిల్లాను శాసించే స్థాయికి ఎదిగిన ఆమె రాష్ట్రవ్యాప్తంగా పేరుగాంచారు. 1997 ఆళ్లగడ్డ ఉప ఎన్నికలో, 1999లలో సాధారణ ఎన్నికలో టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2004లో నంద్యాల నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీలో కీలక పదవులు పోషించిన ఆమె చివరికి పార్టీలో ఇమడలేక చిరంజీవి స్థాపించిన పీఆర్పీలో చేరారు. 2009లో ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం ఇష్టం లేకపోవడంతో ఆమె ఎదురుతిరిగారు. అదే సమయంలో వైఎస్‌ జగన్‌ స్థాపించిన వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్‌ కుటుంబానికి అత్యంత ఆప్తురాలిగా మారిన ఆమె పార్టీలో కీలక నేతగా ఎదిగారు. తొలి నుంచి జగన్‌కు అండగా నిలబడ్డారు. ఆయన మాటకు కట్టుబడి అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసి అనర్హతకు గురయ్యారు. ఆ తర్వాత 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించారు.
ఫ్యాక్షన్‌, రాజకీయ కుటుంబం..
శోభానాగిరెడ్డి 1968 నవంబర్‌ 16న జన్మించారు. మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి కూతురైన ఆమెకు 1986లో భూమా నాగిరెడ్డితో వివాహం జరిగింది. వారికి ముగ్గురు సంతానం. నాగిరెడ్డి నంద్యాల ఎంపీగా, ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా పని చేశారు. రాజకీయ కుటుంబ నేపథ్యం కలిగిన శోభ అనుకోని రీతిలో రాజకీయాల్లోకి వచ్చారు. ఫ్యాక్షనిజానికి పేరొందిన కర్నూలు జిల్లాలో అనూహ్యంగా రాణించారు. 1996 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ఆమె 1997లో ఆళ్లగడ్డకు జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేశారు. టీడీపీలో కీలక నేతగా ఎదిగారు. చంద్రబాబు హయాంలో ఆర్టీసీ చైర్‌ పర్సన్‌గా చేయడమే కాకుండా పార్టీలో వివిధ ¬దాల్లో పని చేశారు. భూమా నాగిరెడ్డి రాజకీయంగా ఎదగడంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. ఫ్యాక్షనిజాన్ని అంతమొందించేందుకు భూమా చేసిన శాంతి యాత్ర వెనుక శోభా పాత్ర చాలా ఉంది.