కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప నీతికేసులో జైలుకెళ్లాడా?


ఒక కంపెనీపై ఎందుకు మోడీకి వల్లమాలిన ప్రేమ

రాహుల్‌గాంధీ ఫైర్‌
అమృతసర్‌, ఏప్రిల్‌ 28 (జనంసాక్షి) :
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప నీతికేసులో జైలుకెళ్లా డా అంటూ కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీని ప్రశ్నించారు. తనకు కావాల్సిన పారిశ్రామికవేత్తల పట్ల సానుకూలంగా ఉంటున్నారని, అవినీ తి పై ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని విమర్శించారు. ఒక కం పెనీపై ఆయనకు అంత ప్రేమ ఎందుకని ఆయన ప్రశ్నించారు. అవినీతిపై కబుర్లు చెప్పే మోడీకి ఛత్తీస్‌గఢ్‌లలో జరిగే అవినీతి కనిపించదా? అని ప్రశ్నించారు. కర్ణాటకలో ఆయన పార్టీకి చెందిన ముఖ్యమంత్రి ఒకరు జైలు పాలైన
సంగతి మరిచిపోయారా? అని నిలదీశారు. పంజాబ్‌లో నిర్వహించిన ఎన్నికల సభలో రాహుల్‌ ప్రసంగించారు. గుజరాత్‌ అభివృద్ధి తన ఒక్కడి వల్లే జరిగిందని చెప్పుకోవడం విడ్డూరమన్నారు. గుజరాత్‌ అభివృద్ధి తన వ్యక్తిగత విజయమని చెప్పుకొంటూ కోట్లాది మంది గుజరాతీయులను మోడీ అవమానిస్తున్నారని అన్నారు. అమూల్‌ బ్రాండ్‌ విజయం వెనుక మహిళల పాత్ర ఉందన్న విషయం ఆయన మరిచిపోయారన్నారు. మహిళలకు శక్తినిస్తామని చెప్పుకొనే వ్యక్తి గుజరాత్‌లో ఓ మహిళను అనుసరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఓ యువతిని వెంటాడి, ఆమె ఫోన్లను ట్యాప్‌ చేసి ఏం జరుగుతుందో చెప్పాలని ¬ం మంత్రిని ఆదేశించడం ఏమంటారని అడిగారు. అలాంటి వ్యక్తి ఢిల్లీలో మాత్రం మహిళలకు శక్తినిస్తామని పెద్ద పెద్ద పోస్టర్లతో ప్రచారం చేసుకొంటారని ఎద్దేవా చేశారు.తమ ప్రసంగాల్లో ప్రేమ, గౌరవం ఉంటాయని, కానీ ఆయన (మోడీ) ప్రసంగంలో మాత్రం గర్వం, కించపరిచే తత్వం ఉంటాయని మండిపడ్డారు. ప్రత్యర్థుల విషయంలోనూ మేం చేసే విమర్శలు గౌరవప్రదంగానే ఉంటాయని, ఎప్పుడూ తీవ్ర పదజాలంతో దూషించబోమన్నారు. కానీ వారు (బీజేపీ నేతలు) మాత్రం ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారని ధ్వజమెత్తారు. ‘మోడీ వస్తాడు.. అంతా నేనే చేశానని చెప్పుకుంటాడు. గుజరాత్‌ను నేనే నిర్మించానంటాడు. దేశాన్ని నేనే నిర్మిస్తానని చెప్పుకొంటాడు. అలా చెప్పడం ద్వారా అందరినీ అవమానిస్తున్నాడని’ అన్నారు. 2004లో దేశం వెలిగిపోతుందంటూ వచ్చిన బీజేపీకి ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలన్నారు. ఎన్డీయే హయాంలో రైతులు, కార్మికులు, బలహీనవర్గాలకు ఎలాంటి లబ్ధి చేకూరలేదని, అయినప్పటికీ వెలిగిపోతుందని గొప్పలు చెప్పుకున్నారని విమర్శించారు. నాటి ప్రభుత్వ హయాంలో పెద్ద పెద్ద ప్రభుత్వ కంపెనీలను కొందరికి గిఫ్ట్‌గా ఇచ్చేశారని మండిపడ్డారు. మోడీ కూడా గుజరాత్‌లో ఒక కంపెనీకి రూపాయికి విూటర్‌ చొప్పున 45 వేల ఎకరాలను కట్టబెట్టారని ఆరోపించారు. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందివ్వడాన్ని తప్పుబట్టడం లేదని, కానీ ఒకే కంపెనీని ప్రోత్సహించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.