మా పొత్తు రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది : బాబు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ, బిజెపి మధ్య ఎన్నికల పొత్తు రాష్ట్ర భవిష్యత్ ను నిర్ణయిస్తుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జుబ్లీహిల్స్‌లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ దేశ, జాతి ప్రయోజనాల కోసమే తాము పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. ఈ ఎన్నికలు రాష్ట్ర ప్రయోజనాలకు దర్పణం పడతాయని చంద్రబాబు తెలిపారు. తమ రెండు పార్టీల మధ్య పొత్తు చారిత్రక అవసరమని చెప్పారు. దేశ ప్రజలు ప్రభుత్వ అవినీతి పట్ల ఆగ్రహంతో ఉన్నారని చంద్రబాబు తెలిపారు. పొత్తు ధర్మంలో భాగంగానే తాను కమలం గుర్తుకు ఓటేశానని చెప్పారు.