మా ప్రేమ నిజమే
పెళ్లి చేసుకుంటా
: దిగ్విజయ్‌సింగ్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30 (జనంసాక్షి) :
టీవీ జర్నలిస్టు అమృతరాయ్‌ను తాను ప్రేమిస్తున్న మాట నిజ మేనని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ తెలి పారు. ప్రేమ
వ్యవహారంపై ఆయన నోరు విప్పారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటానని ఆయన పేర్కొన్నారు. కొంతకాలంగా ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న ఫొటోలపై ఆయన ఎట్టకేలకు స్పందించారు. ప్రముఖ టీవీ జర్నలిస్టు అమృతారాయ్‌ను త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు బుధవారం ప్రకటించారు. కొంతకాలంగా దిగ్విజయ్, అమృతల ఫొటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే, దీనిపై దిగ్గీరాజా కానీ, అమృతారాయ్ కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. వారి సాన్నిహిత్యంపై ఖండించనూ లేదు. చివరకు తాము పెళ్లి చేసుకోనున్నట్లు బుధవారం ట్విట్టర్‌లో వేర్వేరుగా వెల్లడించారు. అయితే, తమ వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూడడాన్ని ఇద్దరూ ఖండించారు. ‘అమృతారాయ్‌తో నా సాన్నిహిత్యాన్ని అంగీకరించడంలో నాకేమీ ఇబ్బంది లేదు. అమృత, ఆమె భర్త పరస్పర ఒప్పందంతో ఇప్పటికే విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ ప్రక్రియ పూర్తయ్యాక మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం. అయితే, తమ వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూడడాన్ని ఖండిస్తున్నా’ అని దిగ్విజయ్ ట్వీట్ చేశారు. ఇదే అమృతారాయ్ కూడా ట్విట్టర్‌లో ధ్రువీకరించారు. తాను భర్త నుంచి విడిపోయానని, పరస్పర ఒప్పందంతో విడాకుల కోసం దరఖాస్తు చేశామని ఆమె పేర్కొన్నారు. విడాకులు మంజూరు కాగానే దిగ్విజయ్‌ను వివాహం చేసుకోనున్నట్లు స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన 67 ఏళ్ల దిగ్విజయ్‌సింగ్ మొదటి భార్య గత ఏడాది మరణించారు.