పోలవరం ప్రాజెక్టుకు అథారిటీ కమిటీ ఏర్పాటు


న్యూఢిల్లీ, మే 1 (జనంసాక్షి)
తెలంగాణ ప్రజలు ఎన్నికల బిజీలో ఉండగానే కేంద్ర ప్ర భుత్వం తెలంగాణను ముం చేసే పోలవరం ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే చర్యలను వేగవంతం చేసింది. సందట్లో సడేమియాలా ప్రజలంతా ఎ న్నికలు, ఓట్ల
విశ్లేషణలు, తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఎవరిది రాబోతోంది అనే లెక్కల్లో మునిగి ఉండగానే కేంద్రం తన పని తాను చేసుకుపోయింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కేంధ్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అథారిటీని ఏర్పాటు చేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. గురువారం ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నేతృత్వంలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో దీనికి ఆమోదముద్ర వేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో 90 శాతం నిధులు కేంద్రం నుంచి రానున్నాయి. అలాగే నిర్దిష్ట కాలవ్యవధిలో ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించారు.