వారెవ్వా! ఆకాశ్
క్షిపణి పరీక్ష విజయవంతం
బాలాసోర్, మే 1 (జనంసాక్షి) :
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆకాశ్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. గురువారం ఒడిశాలోని చాందిపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి గగణతలంలోని లక్ష్యా లను ఛేదించే ఈ క్షిపణి 30 కిలోమీటర్ల వరకు దూసుకెళ్తుంది. 60 కిలోల వార్‌హెడ్‌ను మోసు కళ్తుంది. ఈ క్షిపణిని ఇక్కడి నుంచి గత నెల 26న కూడా విజయవంతంగా పరీక్షించారు. గురు వారం నాటి ప్రయోగం పూర్తిస్థాయిలో విజయవంతమైందని ఐటీఆర్ డైరెక్టర్ ఎంవీకేవీ ప్రసాద్ అ న్నారు. భారత వైమానిక దళం దీన్ని పరీక్షించిందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయోగం సంద ర్భంగా ఆకాశ్‌ను పారాబ్యారెల్ లక్ష్యానికి గురిపెట్టారు. ఉదయం 10.58 గంటలకు ఐటీఆర్‌లోని లాంచ్ కాంప్లెక్స్-3 నుంచి దీనిని ప్రయోగించారు. మధ్యశ్రేణి క్షిపణి అయిన ఆకాశ్ రక్షణ పరి శోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేసింది. 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సమర్థంగా ఛేదించగల సామర్థ్యం ఆకాశ్ సొంతం. ఈ క్షిపణి ద్వారా ఏకకాలంలో అనేక లక్ష్యాలపై దాడి చేయవచ్చు. యుద్ధవిమానాలు, క్రూయిజ్ క్షిపణులు, గగనతలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణులను ఇది నేలకూల్చగలదు. అమెరికాకు చెందిన ఎంఐఎం-104 పేట్రియాట్ క్షిపణి వ్యవస్థ తరహాలో ఇది పనిచేస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆకాశ్‌కు సంబంధించి వైమానిక దళ వెర్షన్‌ను ఇప్పటికే ఆ దళం అమ్ములపొదిలో ఉంది. సైన్యానికి చెందిన వెర్షన్ సిద్ధమవుతోంది.