78మంది రైతులకు మొక్కలు అందజేత

వినుకొండ, జూలై 11 : వనసంరక్షణ సమితి పథకం ద్వారా ఈపూరు, బొల్లాపల్లి మండలాలకు చెందిన 78 మంది రైతులకు 50 టేకు, జామాయిల్‌ మొక్కలను పంపిణీ చేశారు. పారెస్ట్‌ రేంజర్‌ అల్లాబక్షు ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ చేపట్టారు. వనసంరక్షణ కేంద్రంలో లక్ష మొక్కలు రైతులకు అందుబాటులో ఉన్నాయన్నారు. గతంలో జాబ్‌కార్డు కలిగిన ఎస్సీ, ఎస్టీ రైతులకు మాత్రమే ఈ అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం రైతులెవరైనా పొలాల్లో మొక్కలు నాటుకునేందుకు ప్రభుత్వం అనుమతించిందన్నారు. ఈ కార్యక్రమంలో పారెస్టు డిఆర్‌ఓ వెంకటేశ్వరరావు, పీల్డ్‌ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.