అవినీతిపై మోడీది ద్వంద్వ వైఖరి
ప్రజల్ని విభజించడమే భాజపా రాజకీయం : రాహుల్
లక్నో, మే 6 (జనంసాక్షి) :అవినీతిపై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీది ద్వంద్వ వైఖరి అని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. భారతీయ జనతా పార్టీ విభజన రాజకీయాల్నే నమ్ము కుందని ఆరోపించారు. ఆ పార్టీ కార్పొరేట్ శక్తుల కోసమే తప్ప సామాన్యుల కోసం కాదని దుయ్యబట్టారు. మోడీవన్నీ విభజన రాజకీయాలని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని విూర్జాపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభ లో ఆయన మాట్లాడారు. కులం, మతం పేరిట ప్రజలను విభజించి భాజపా ఓట్లు కొల్లగొట్టాలని చూస్తోం దని విమర్శించారు. దీనిపై వారి వైఖరిని ప్రజలు గమనించాలన్నారు. కార్పొరేట్లకు దోచి పెట్టేందుకు దేశా న్ని లూటీ చేస్తారని ఆరోపించారు. రాష్ట్రంలో యువతకు సమాజ్‌వాద్ పార్టీ ఉద్యోగాలు కల్పించలేక పోయిం దన్నారు. దీంతో యువత పెద్దఎత్తున మహారాష్ట్ర, అస్సాం, హర్యానా వంటి రాష్ట్రాలకు వలస వెళ్లిపోతు న్నారని రాహుల్ పేర్కొన్నారు. ఇక్కడి ప్రజలకు బరోసా ఇవ్వాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ గత పదేళ్లలో అనేక విప్లవాత్మక మార్పులతో ముందుకు వెల్లిందన్నారు. అలాగే అనేక పథకాలతో ప్రజలకు మేలు చేసిందన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు పోతున్నామని, మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం ఇవ్వాలన్నారు.