రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కరీంనగర్: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ సమీపంలో గడిచిన అర్థరాత్రి రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఓ ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం క్షతగాత్రుడ్ని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.