పరస్పర అవగాహనతోనే ఆ సంబంధం : మోనికా లెవెన్‌స్కీ


వాషింగ్టన్‌, మే 7 (జనంసాక్షి) :అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌క్లిం టన్‌తో పరస్పర అవగాహనతోనే శారీరక సంబంధం కొనసాగించానని వై ట్‌ హౌస్‌ మాజీ ఉద్యోగి మోనికా లెవెన్‌స్కీ వెల్లడించారు. వానిటీ ఫెయిర్‌ పత్రిక కోసం రాసిన వ్యాసంలో తమ మధ్య సంబంధం కొనసాగిన నాటి సంఘటనల్ని ఆమె పేర్కొన్నారు. తమ మధ్య ఎఫైర్‌కు క్లింటనే చొరవ తీసుకున్నారని ఒక చోట ప్రస్తావించిన మోనికా
మరోసారి శారీరక సంబంధానికి తొలుత క్లింటన్‌ ఒప్పుకోలేదని పేర్కొన్నారు. ఆ తర్వాత తన పదవిని కాపాడుకోవడానికి తనను బలిపశువును చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అదే సందర్భంలో తమ మధ్య బంధానికి ముగింపు పలకాల్సి వచ్చిందని తెలిపారు. తమ ఇద్దరి మధ్య జరిగిన వ్యవహారానికి తాను తీవ్ర పశ్చాత్తాపానికి గురయ్యానని ఆమె వెల్లండించారు. 1990లో అమెరికా అధ్యక్షుడిగా బిల్‌ క్లింటన్‌ పనిచేసిన కాలంలో వైట్‌ హౌస్‌ సేవకురాలు మోనికాతో వివాహేతర బంధాన్ని ఏర్పరు చు కున్నాడు. ఇది త్రీవ విమర్శలకు దారితీసింది. అదే సమయంలో మార్కెట్‌ మోనికా-క్లింటన్‌ల బంధా న్ని ఉత్పాదకతను విక్రయించుకోవడానికి వాడుకుంది. వారిపేర్లతో అప్పట్లో అనేక బ్రాండ్లు మార్కెట్‌ను ముంచెత్తిన విషయం తెలిసిందే.