టెట్ ఫలితాలు విడుదలు
హైదరాబాద్ : ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. గురువారం మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేశారు. టెట్ వెబ్‌సైట్ www. aptet.cgg.gov.inలో ఫలితాలు పొందుపరిచినట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే టెట్ ఫైనల్ కీని కూడా విడుదల చేశారు. మార్చి 16న జరిగిన టెట్ పేపర్-1కు 56వేల 546 మంది, పేపర్2కు 3లక్షల 39వేల 251 మంది అభ్యర్ధులు హాజరయ్యారు.
రెండు పేపర్లు రాసిన అభ్యర్థులు 7వేల మంది ఉన్నారు. డీఈడీ అభ్యర్థులు రాసిన పేపర్ వన్-1లో 73.92 మంది, బీఈడీ పేపరు-2లో 32.32 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ నెల 15 నుంచి ఆన్సర్ షీట్లు aptet వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంటాయి. ఫలితాల కోసం www.sakshieducation.comలో చూడవచ్చు.