చుండూరు హంతకులకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదు


కారంచేడు, వేంపెంట హంతుకులకు పట్టిన గతే మీకు పడుతుంది
మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ హెచ్చరిక
హైదరాబాద్‌, మే 10 (జనంసాక్షి)
కోర్టు నిర్దోషులుగా ప్రకటించినా చుండూరు హంతకులకు ప్రజాకో ర్టులో శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ హెచ్చ రించారు. ఈమేరకు శనివారం పత్రి కా కార్యాలయాలకు ఒక ప్రకటన పంపారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం చుండూరులో ఎనిమిది మంది దళితులను ఊచకోత కోసిన అగ్రవర్ణాలకు చెందిన దోషులను హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించడం పై మావోయిస్టు పార్టీ ఆగ్రహం వ్య క్తం చేసింది. కోర్టులు, చట్టాలు ఉన్న వారికి వంతపాడుతున్నాయని ఆరో పించింది. గతంలో
కారంచేడు, వేంపెంటలలో దళితులపై హత్యలు, అత్యాచారాలు చేసిన అగ్రవర్ణాలకు ఏం శిక్షలైతే పడ్డాయో ప్రజాకోర్టులో చుండూరు దోషులకు అవే శిక్షలు పడుతాయని జగన్‌ హెచ్చరించారు. ఊచకోతలో కుటుంబ పెద్దలను కోల్పోయి, భయంతో బతుకులీడుస్తున్న దళితులకు న్యాయం జరిగే వరకూ ప్రజాస్వామికవాదులు వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. చుండూరు ఊచకోత నిందితులు కోర్టు నుంచి తప్పించుకున్నా ప్రజాకోర్టు నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు.