కాంగ్రెస్ పేదల పార్టీ.. భాజపా పెట్టుబడిదారుల పార్టీ
వారణాసిలో రాహుల్ రోడ్ షో
వారణాసి, మే 10 (జనంసాక్షి) :కాంగ్రెస్ పేదల పార్టీ అని, బీజేపీ పెట్టుబడిదా రుల పార్టీ అని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. అమేథిలో నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ బదులు తీర్చుకున్నారు. మోడీ పోటీలో ఉన్న వారణాసిలో ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు. మోడీ ర్యాలీకి ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించిన ప్రాంతంలోనే రోడ్ షో నిర్వహించిన రాహు ల్ ఆయనపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. రాహుల్ శనివారం వారణాసిలో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ పేదల సాధికారత కోసం కట్టుబడి ఉం దని రాహుల్‌గాంధీ తెలిపారు. పేదల సంపద పెరగాలని కాంగ్రెస్ చూస్తుంటే ఇత రులు పారిశ్రామిక వేత్తల సంపద పెరగాలని చూస్తున్నారని పరోక్షంగా బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. గుజరాత్‌లో రైతులకు చెం దిన 43 వేల ఎకరాలను ఓ బడా పారిశ్రామిక వేత్తకు కట్టబెట్టారని ఆరోపించారు. యూపీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హావిూ ఇచ్చారు. తాము విజ యం సాధించడానికే పోటీ చేస్తున్నామని, వారణాసిలో గెలిచి
తీరతామని ధీమా వ్యక్తం చేశారు.గుజరాత్‌లో ఓ మహిళ కదలికపై మోడీ రహస్య విచారణ జరిపించారన్న ఆరోపణలపై రాహుల్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. మహిళలకు సాధికారత కల్పిస్తామని, బలోపేతం చేస్తామన్న మోడీ వ్యాఖ్యలపై రాహుల్ మండిపడ్డారు. స్నూప్‌గేట్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ. ‘మోడీ జీ ముందు మహిళలను గౌరవించడం నేర్చుకోండి. వారి ఇంటికి పోలీసులను పంపించడం, ఫోన్లను ట్యాపింగ్ చేయించడం మానుకోండి. విూరు మహిళలను బలోపేతం చేయాల్సిన అవసరం లేదు. కానీ, వారికి కాస్తంత గౌరవం ఇవ్వండి చాలు’ అని ఎద్దేవా చేశారు. పేదలకు, సంపన్నులకు అంతరం తగ్గించడానికి తమ పార్టీ ప్రయత్నిస్తోందని తెలిపారు. జీవించు, ప్రేమించు, శాంతంగా ఉండు అనే బౌద్ధాన్ని కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తుందన్నారు. వైమానిక దళానికి గుజరాత్‌లో మోడీ భూమి అవ్వకపోవడాన్ని రాహుల్ తప్పుబట్టారు. అతి తక్కువ ధరకు మోడీ అదానీ కంపెనీకి 45 వేల ఎకరాల పేదల భూమిని కట్టబెట్టారని విమర్శించారు. ఓపెన్ టాప్ జీప్‌లో రాహుల్ రోడ్ షో నిర్వహించారు. ఆయనకు కాంగ్రెస్ కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. రాహుల్ కాన్వాయ్‌పై పూలు చల్లుతూ నినాదాలు చేశారు. ముస్లింలు అధికంగా నివసించే గోల్ గద్దా ప్రాంతం నుంచి నాలుగు కిలోవిూటర్ల దూరం వరకు రోడ్ షో కొనసాగింది. ఇందుకు ఆయనకు నాలుగు గంటల సమయం పట్టింది.
రాహుల్ రోడ్ షోలో బిస్మిల్లాఖాన్ కుటుంబం
వారణాసిలో ఎన్నికల కు ముందే బీజేపీకి పె ద్ద షాక్ తగిలింది. కాం గ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీలో ప్రముఖ షహ నాయి వాయిద్య కారు డు బిస్మిల్లాఖాన్ కు టుంబం పాల్గొనడం క మలదళానికి షాకి చ్చిం ది. కాంగ్రెస్ ఉపాధ్యక్షు డు రాహుల్‌గాంధీ ని ర్వహించిన శనివారం వారణాసిలో నిర్వహిం
చిన రోడ్‌షోకు బిస్మిల్లాఖాన్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. గతంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ నామినేషన్‌కు ప్రతిపాదకులుగా ఉండాలని బీజేపీ నేతలు బిస్మిల్లాఖాన్ కుమారుడు జవిూన్ హుస్సేన్‌ను కోరారు. అయితే, తమ కుటుంబం రాజకీయాలకు దూరమని పేర్కొన్న ఆయన.. ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. అయితే, శనివారం రాహుల్‌గాంధీ నిర్వహించిన రోడ్‌షోలో వారు పాల్గొనడం విశేషం. రోడ్‌షోలో పాల్గొనేందుకు వచ్చిన రాహుల్‌కువారణాసిలోని బేనియాబాగ్‌లో బిస్మిల్లాఖాన్ కుటుంబం షహనాయి వాయిస్తూ స్వాగతం పలికింది. అంతేకాకుండా కాంగ్రెస్ కండువాలు ధరించి బేనియాబాగ్‌లో షహనాయి ప్రదర్శన నిర్వహించింది. దీంతో బీజేపీ ఇరకాటంలో పడినట్లయింది. అయితే, బీజేపీకి తాము వ్యతిరేకం కాదని బిస్మిల్లాఖాన్ కుటుంబం వివరణ ఇచ్చింది. ఇందిర, రాజీవ్‌గాంధీలతో ఉన్న సన్నిహిత సంబంధం కారణంగానే తాము రాహుల్ రోడ్‌షోలో పాల్గొన్నామని పేర్కొంది.