నేదురుమల్లికి కన్నీటి వీడ్కోలు


నెల్లూరు, మే 10 (జనంసాక్షి) :
మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డికి కన్నీటి వీడ్కోలు పలికారు. కాలేయ సంబంధ వ్యాధితో హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొం దుతూ శనివారం ఆయన కన్నుమూసిన సంగతి తెలిసిందే. శనివారం సా యంత్రం ఇందిరా భవన్‌లో ప్రజల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని గంటపాటు ఉంచి, అనంతరం స్వగ్రామమైన నెల్లూరు జిల్లాలోని వాకాడుకు తరలించారు. ఆదివారం మధ్యాహ్నం పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు నేదురుమల్లి పార్థీవదేహానికి తమిళనాడు గవర్నర్‌ కొణిజేటి రోశయ్య, కేంద్ర మంత్రి జేడీ శీలం, ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ మంత్రులు ఆనం
రాంనారాయణరెడ్డి, బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, సినీ నటుడు మోహన్‌బాబు సహా తదితరులు నివాళులర్పించారు. వాకాడులో ఆయన అంతిమయాత్రకు అశేషంగా ప్రజలు తరలివచ్చి చివరి చూపు చూసుకున్నారు.