ఈ ఫలితాలు వేరు


సార్వత్రికంలో మేమే విజయం సాధిస్తాం
టీఆర్‌ఎస్‌ నేత ఈటెల రాజేందర్‌
హైదరాబాద్‌,మే12(జనంసాక్షి):
మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు వేరని, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీిఆర్‌ఎస్‌దే విజ యమని టీఆర్‌ఎస్‌ నేత ఈటెల రాజేందర్‌ ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలపె తెలంగాణ రాష్ట్ర సమితి సోమవారం స్పందించింది. సీమాంధ్ర పార్టీల ప్రలోభాలు తట్టుకొని తాము ఈ మేరకు విజయం సాధించడం తక్కువేమీ కాదని ఆయన పేర్కొన్నారు. తెరాసకు మద ్దతు పలికిన ప్రజలందరికీ ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికలు కేవలం స్థానిక అంశాల ఆధారంగా జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. తాను అనుకున్న ఫలితాలే ఈ
ఎన్నికల్లో వచ్చాయని ఆయన తెలిపారు. ఇవి నిర్ణాయక ఎన్నికలు కాదన్నారు. ప్రజలు స్థానిక అభ్యర్థులను చూసి ఓట్లేస్తారని చెప్పారు. అనేక స్థానాల్లో గెలిచినవాళ్లు, పరాజితులు తెలంగాణవాదులేనని ఆయన పేర్కొన్నారు. మరో మూడు రోజుల్లో ఎవరి భవిష్యత్తు ఏంటో తెలిసిపోతుందన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, శాసనసభ, అసెంబ్లీ ఎన్నికల్లో తమదే గెలుపు అని పునరుద్ఘటించారు.