పొన్నాల.. నువ్వో సన్యాసి


కేవీపీ సలహాతోనే పనిచేయలేదు

నాయకత్వ లేమితోటే

పార్టీ ఓటమి : పాల్వాయి

హైదరాబాద్‌, మే 17 (జనంసాక్షి) :

తెలంగాణ పీసీసీ అధ్య క్షుడు పొన్నాల లక్ష్మ య్యపై పార్టీ నేతల దాడి మొదలైంది. ఆయనను సన్యాసిగా రాజ్యసభ స భ్యుడు పాల్వాయి గోవర ్ధన్‌రెడ్డి పేర్కొన్నాడు. కేవీ పీ రామచంద్రరావు సల హాలతోనే పొన్నాల టికె ట్లు కేటాయించారని, పనిచేయకుండా నియో జకవర్గానికే పరిమితమయ్యారని ఆయన అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లా డారు. ఓట మికి పొన్నాలదే బాధ్యతని, అతడిని తొలగించాలని పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి స్పష్టం చేశా రు. తన కుమార్తె కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదని పార్టీని

బతికించుకునేందుకే ఎన్నికల బరిలోకి దిగిందని అన్నారు. కేవీపీ సలహా మేరకే కాంగ్రెస్‌ నేతలు నడుచుకున్నారని అందుకే పార్టీ దెబ్బతిందన్నారు. తెరాసతో పొత్తు పెట్టుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. పొన్నాల తనతో పాటు పార్టీని కూడా గెలిపించ లేకపోయారని, ఆయనకు పార్టీని నడిపే శక్తి లేదన్నారు. ఆయన టిక్కెట్లను డబ్బులకు అమ్ముకున్నారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఓటమికి టీపీసీసీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య బాధ్యత వహించాలని నిజామాబాద్‌ మాజీ ఎంపీ మధుయాష్కి అన్నారు. అయితే పార్టీ ఓటమికి సమష్టి బాధ్యత వహించాలని మిగతా నేతలు తెలిపారు. శనివారం తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు  కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌రెడ్డి నివాసంలో సమావేశమై ఎన్నికల ఫలితాలపై సవిూక్ష జరిపారు. అనంతరం గుత్తా విూడియాతో మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లలేకపోయామన్నారు. కేసీఆర్‌ ఇచ్చిన హావిూలను ప్రజలు నమ్మరని గుత్తా వ్యాఖ్యానించారు. ఆయన ఇచ్చిన హామీలు ఆచరణ సాధ్యమా లేదా అనేది టీఆర్‌ఎస్‌ పాలనలో తేలుతుందని అన్నారు. ఈ అయిదేళ్లూ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని గుత్తా సుఖేందర్‌ రెడ్డి తెలిపారు. మహబూబ్‌గర్‌ కాంగ్రెస్‌ ఎంపీగా పోటీ చేసిన జైపాల్‌ రెడ్డి ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఉదయం ఆయన నివాసంలో నేతలంతా సమావేశమై ఫలితాలపై సవిూక్షించారు. పొన్నాల లక్ష్మయ్య తదితరులు హాజరయ్యారు. ఇదిలావుంటే అధినేతలపై ఆధారపడడం తప్ప తమకు సమష్టి నాయకత్వం కొరవడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రచారం సమయంలో ముఖ్య నేతలు నియోజక వర్గాలకే పరిమితమయ్యారన్నారు. దీనివల్లనే ఓటమి తప్పలేదన్నారు.