అధికార నివాసాలు ఖాళీ చేయండి..
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన ఎంపీలు వచ్చే నెల 18లోగా ఢిల్లీలోని తమ అధికార నివాసాలను ఖాళీ చేయాలని పార్లమెంట్ హౌసింగ్ కమిటీ ఆదేశాలు జారీచేసింది. లోక్‌సభను రద్దు చేస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడంతో నెల రోజుల్లోగా ఎంపీలు అధికార నివాసాలను ఖాళీ చేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
ఎంపీలకు కేటాయించిన ఫోన్, ఇంటర్‌నెట్ సహా ఇతర సౌకర్యాలను తొలగించారు. జూన్ 18 తర్వాత అధికారిక నివాసాలను ఖాళీ చేయని ఎంపీలు నెలకు సుమారు రూ.1.50 లక్షల వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది.