ఓయూ పీజీ ఎంట్రెన్స్ టైమ్ టేబుల్

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పీజీ ఎంట్రెన్స్‌లకు సంబంధించి వర్సిటీ అధికారులు టైమ్ టేబుల్ విడుదల చేశారు. పీజీ ఎంట్రెన్స్ పరీక్షలు జూన్ 6 నుంచి 14 వరకు జరగనున్నాయి. హాల్‌టికెట్లు ఈ నెల 29 సాయంత్రం 5 గంటల తర్వాత ఓయూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఇతర వివరాల కోసం http://www.osmania.ac.in/ వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.