తెలంగాణపై ఎలాంటి వివక్ష ఉండదు : నిర్మలా సీతారామన్

 హైదరాబాద్, జూన్ 7 : తెలంగాణపై ఎలాంటి వివక్ష చూపబోమని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దేశంలోని ప్రతీ రాష్ట్రాన్ని గుజరాత్ తరహాలో అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ కల అని ఆమె అన్నారు. మోదీ నాయకత్వంలో అందరం కలిసి పనిచేద్దామని నిర్మల పిలుపునిచ్చారు. తెలంగాణ, ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

మహిళలపై అఘాయిత్యాలను అరికడతామని, బ్లాక్‌మనీని రప్పించి దేశాభివృద్ధికి వెచ్చిస్తామని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. చంద్రబాబు ప్రమాణస్వీకారానికి హాజరవుతానని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి హైదరాబాద్‌కు వచ్చిన నిర్మలా సీతారామన్‌కు స్థానిక ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.