విహార యాత్రలకు విధానం లేదా?

kcr-2
సమీక్ష సమావేశంలో అధికారులను ప్రశ్నించిన సీఎం
భవిష్యతులో ఘటనలు పునరావృత్తం కాకుండా చూడండి : కేసీఆర్‌
హైదరాబాద్‌, జూన్‌ 10 (జనంసాక్షి) :
విహార యాత్రలకు విధానమంటూ ఏమీ లేదా అని ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారులను ప్రశ్నిం చారు. నగరంలోని వీఎన్‌ఆర్‌ విజ్ఞాన్‌జ్యోతి ఇంజినీరింగ్‌ కళాశా లకు చెందిన విద్యార్థులు ఇండస్ట్రియల్‌ టూర్‌ పేరుతో విజ్ఞాన యాత్రకు వెళ్లి ప్రమాదానికి గురికావడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. కళాశాల, పాఠశాల విద్యార్థుల విహార యాత్ర లకు కఠినతరమైన నిబంధనలు రూపొందించాలని ఆయన ఆదే శించారు. ఇప్పటికే అలాంటి నిబంధనలు ఉంటే వాటిని కచ్చి తంగా పాటించేలా చర్యలు చేపట్టాలని, అలాంటి నిబంధనలు పాటించని విద్యాసంస్థల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసు కోవాలని ఆదేశించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరా వృత్తం కాకుండా చూడాలని అన్నారు. ఐటీఐఆర్‌ ప్రాజెక్టుతో రాష్ట్రం ఎంతో బలపడుతుందని కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. ఐటీఐఆర్‌ ప్రాజెక్టుకు సంబంధించిన
మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఐటీఐఆర్‌లో భాగంగా గచ్చిబౌలి, మహేశ్వరం, పోచారం ప్రాంతాలను తీర్చిదిద్ది మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. హైదరాబాద్‌ను వైఫై నగరంగా తీర్చిదిద్దేందుకు అనేక కంపెనీలు 4జీ టెక్నాలజీతో ముందుకొస్తున్నాయని అన్నారు. త్వరలోనే నగరంలో 4జీ సేవలను ప్రారంభించడానికి కావాల్సిన చర్యలు చేపట్టాలని అన్నారు. అలాగే కేసీఆర్‌ పంచాయతీరాజ్‌ అధికారులతోనూ సమీక్షించారు. సిద్దిపేట మోడల్‌లో గ్రామీణ ప్రాంతాలకు మంచినీటిని అందజేయాలని అన్నారు. పంచాయతీరాజ్‌ రోడ్లకు నిధుల కొరతపై కేసీఆర్‌ దృష్టి సారించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన వివరాలను అధికారుల నుంచి తీసుకున్నారు. ఈ వర్షాకాలంలో 7.02 లక్షల మొక్కలు నాటాలని ఆదేశించారు.