బిలాయ్ ఉక్కు ఖర్మాగారంలో విషవాయువు లీక్
ఐదుగురి మృతి.. 34 మందికి అస్వస్థత
రాంచీ, జూన్ 12 (జనంసాక్షి) :
ఛత్తీస్‌గఢ్‌లోని ప్రసిద్ధ బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారంలో పెను ప్రమాదం సంభవించింది. కర్మాగారంలో గ్యాస్ లీకైన ఘటనలో ఐదుగురు కార్మికులు మృతిచెందగా, 34 మంది అస్వస్థతకు గురైనట్టు తెలిసింది, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గురువారం రాత్రి సమయంలో కర్మాగారంలోని వాటర్‌ప్లాంటులో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా ప్రమాదకరమైన వాయువులు వెలువడ్డాయి. దీంతో ఆ వాయువును పీల్చిన కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా విష వాయువు పీల్చిన మరో 34 మంది పరిస్థితి విషమంగా ఉంది. వీరిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. గ్యాస్‌ను అదుపు చేసేందుకు టాస్క్‌ఫోర్స్ బృందం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.