ఆంధ్ర చానెళ్లను పీకేయండి
తెలంగాణ ఎంఎస్‌వో అధ్యక్షుడు సుభాష్‌రెడ్డి హుకుం
హైదరాబాద్, జూన్ 15 (జనంసాక్షి) :తెలంగాణ శాసనసభ్యులను కించపరిచేలా కథనాలు ప్రసారం చేసిన టీవీ 9, ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి చానెళ్లను తెలంగాణ ప్రాంతంలో పీకెస్తున్నట్లు ఎంఎస్‌వోలు తెలిపారు. తెలంగాణ ఎంఎస్‌వోల సంఘం అధ్యక్షుడు సుభాష్‌రెడ్డి ఆ రెండు చానెళ్లను పీకెయ్యాలంటూ కేబుల్ ఆపరే టర్లకు ఆదివారం హుకుం జారీ చేశారు. సోమవారం నుంచి ఆ రెండు చానెళ్ల ప్రసా రాలు తెలంగాణలో ఉండబోవని ఆయన స్పష్టం చేశారు. శాసనసభ గౌరవాన్ని కిం చపరిచేలా ప్రసారాలు చేసిన టీవీ 9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై
చర్యలు తీసుకునే అంశాన్ని శాసనసభ స్పీకర్‌కు, మండలి చైర్మన్‌కు కట్టబెడుతూ ఇరు సభలు తీర్మానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చట్టపరమైన చర్యలకు ముందే ఎంఎస్‌వోలు ఆ రెండు చానెళ్ల ప్రసారాలను నిలిపివేస్తున్నారు. సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వాన్ని నెగిటివ్ కోణంలో చూపించడానికి ఆంధ్రజ్యోతి శథవిధాల ప్రయత్నిస్తోందని, పనిగట్టుకుని విషం చిమ్ముతుందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు, ప్రజాప్రతినిధులను అవమానించి, వారి గౌరవానికి భంగం వాటిల్లేలా చేసే ఏ మీడియానైనా వదలబోమని ఎంఎస్‌వోలు తేల్చిచెప్పారు.