యూపీపై కన్నేశాం
శాంతి భద్రతలపై ఆరాతీస్తున్నాం
కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
న్యూఢిల్లీ, మే 16 (జనంసాక్షి) :
ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై కన్నేశామని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. అక్కడ శాంతిభద్రతల పరిస్థితి నానాటికీ దిగజారుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యువతులు, బాలికల మాన ప్రాణాలకు రక్షణ లేదు.. రాజకీయ నేతల బతులకు భరోసా లేదు.. చివరకు శాంతిభద్రతలు రక్షించే పోలీసులకూ రక్షణ లేదని ఆయన పేర్కొ న్నారు. ఇటీవలి కాలంలో ఉత్తరప్రదేaలో శాంతిభద్రతలు దారుణంగా క్షీణిం చాయని ఇరవై రోజుల వ్యవధిలో లెక్కలేనన్ని
ఉదంతాలు జరిగాయని అన్నారు. బదాయులో ఇద్దరు బాలికలపై అత్యాచారం చేసి, హతమార్చి చెట్టుకు వేలాడదీశారని, అది జరిగిన వారం రోజులకే ఓ వివాహితను అపహరించి సామూహిక అత్యాచారం జరిపి హత్య చేశారని పేర్కొన్నారు. ఆ తర్వాతి రోజే ఇలాంటివి మరో రెండు ఉదంతాలు వెలుగులోకి వచ్చాయని, స్థానిక అధికార పార్టీకి ప్రత్యర్థులపైనా దాడులు పెరిగిపోయాయని చెప్పారు. కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ నాయకులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ముగ్గురు పార్టీ అధికార ప్రతినిధులు హత్యకు గురయ్యారు. ఏకంగా ఎంపీపైనా కాల్పులు జరిగాయి. రెండ్రోజుల క్రితం ఇద్దరు పోలీసులను కిరాతకంగా హతమార్చారు. దోపిడీ దొంగలను పట్టుకొనేందుకు వెళ్తున్న వారిని విచక్షణరహితంగా కాల్చిచంపారు. ఈ ఘటనను నిరసిస్తూ సోమవారం ఫిరోజాబాద్‌లో స్థానికులు భారీగా ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలో శాంతిభద్రతల క్షీణతపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ”యూపీలో శాంతిభద్రతలు క్షీణించడంపై హోం మంత్రిత్వ శాఖ నిశితంగా గమనిస్తోంది. యూపీలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సవిూక్షిస్తున్నామని ఆయన సోమవారం మీడియాతో తెలిపారు. అయితే, శాంతిభద్రతలు కాపాడాల్సిన అధికార సమాజ్‌వాదీ పార్టీ.. ప్రత్యర్థులపై ఆరోపణలకే పరిమితమవుతోంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు మోడీ సర్కారు యత్నిస్తోందని ఆ పార్టీ నేత నరేశ్ అగర్వాల్ సోమవారం ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గురించి తప్పుడు ప్రచారం జరుగుతోందని, దీని వెనక కేంద్రం హస్తం ఉందని తెలిపారు. ఏ రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరగడం లేదని ఆయన ప్రశ్నించారు. తాము కూడా ఇలాంటి ఘటనలను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు.