యూపీ గవర్నర్‌ జోషి రాజీనామా

joshi
న్యూఢిల్లీ, జూన్‌ 17 (జనంసాక్షి) :
యూపీఏ ప్రభుత్వ హయాంలో నియమించిన గవర్నర్లను మార్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉ న్నట్టు తెలుస్తోంది. ఇందలో భాగం గా యూపీఏ హయాంలో నియమి తులైన గవర్నర్లు స్వచ్ఛందంగా తమ పదవులకు రాజీనామా చేయ ూలని సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. యూపీఏ పాల నలో సోనియాగాంధీ విధేయులే గవర్నర్లుగా నియమితులయ్యారని, రాజక ీయ లబ్ధి కోసమే గవర్నర్ల నియామకం జరిగిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌ నేతలు షీలా దీక్షిత్‌, ఎంకే నారాయణ, శివరాజ్‌పాటిల్‌ను ఇలాగే గవర్నర్లుగా నియమించారని సుబ్రహ్మణ్యస్వామి
అన్నారు. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ బీఎల్‌ జోషి మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాలను ¬ం మంత్రిత్వ శాఖకు పంపించారు. నరేంద్రమోడీ ప్రభుత్వం యూపీఏ హయాంలో నియమించిన గవర్నర్‌లను మార్చాలని యోచిస్తోందని వార్తలు వస్తున్న తరుణంలో జోషి తన రాజీనామాను సమర్పించారు. ఆయన పదవీకాలం వచ్చే నెలతో ముగియనుంది. యూపీఏ-2 హయాంలో నియమించిన ఉత్తరప్రదేశ్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, పంజాబ్‌ రాష్ట్రాల గవర్నర్లను మార్చాలని కేంద్రం యోచిస్తున్నట్లు వూహాగానాలున్నాయి. కేరళ గవర్నర్‌, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ ఈ విషయంపై స్పందించడానికి నిరాకరించారు. తాను పుకార్లను పట్టించుకోనని తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు కావస్తున్నా గవర్నర్లు పదవులు పట్టుకుని వేలాడుతున్నారు. ఇంతకాలం వారు రాజీనామా చేస్తారని ఎదురుచూసిన ప్రధానికి వారి నుంచి సానుకూల ధోరణి కనిపించకపోవడంతో ఇక వారిని తొలగించాలని నిర్ణయానికి వచ్చారని సమాచారం. ఇదిలావుంటే రాజస్థాన్‌ గవర్నర్‌ మార్గరెట్‌ ఆల్వా ప్రధానితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరికొన్ని రోజుల్లో ఐదు రాష్ట్రాల గవర్నర్లు తమ పదవులకు రాజీనామా చేయనున్నట్లు సమాచారం.