రాజీనామా చేయమని యూపీఏ గవర్నర్లకు హుకుం
ఛత్తీస్‌గఢ్ గవర్నర్ రాజీనామా శ్రీమోడీతో కర్ణాటక గవర్నర్ భేటీ
న్యూఢిల్లీ, జూన్ 19 (జనంసాక్షి) :యూపీఏ పాలనలో నియమించిన గవర్నర్లు రాజీనామా చేయాలంటూ కేంద్ర సర్కారు హుకుం జారీ చేసింది. గవర్నర్లను సాగనంపేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఒత్తిడి ఫలిస్తోంది. యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లు ఒక్కొక్కరుగా రాజీనామా చేస్తున్నారు. ఎన్డీయే ప్రభుత్వం సాగనంపక ముందే గౌరవంగా నిష్క్రమిం చాలనే ఉద్దేశ్యంతో తప్పుకొంటున్నారు. మరికొందరు మాత్రం తాము రాజీ నామా చేయబోమని తేల్చి చెబుతున్నారు. చత్తీస్‌గఢ్ గవర్నర్ శేఖర్‌దత్ గురు వారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన బాటలోనే నాగాలాండ్ గవర్నర్ అశ్వనీకుమార్ కూడా త్వరరలోనే రాజీనామా చేయనున్నట్లు సమా చారం. శేఖర్‌దత్ ఆయన తన రాజీనామా లేఖను బుధవారం రాత్రి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపించారు. ‘తన రాజీనామా లేఖను శేఖర్‌దత్ రాష్ట్రపతికి పంపించారని’ ఛత్తీస్‌గఢ్ ప్రజాసంబంధాల శాఖ కార్యదర్శి అమన్‌సింగ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. వాస్తవానికి వచ్చే జనవరిలో ఆయన పదవీ కాలం ముగియనుంది. అయితే, యూపీఏ హయాంలో నియమించిన గవర్నర్లు తప్పుకోవాలని కేంద్రం చేస్తున్న ఒత్తిడి మేరకు ఆయన తప్పుకున్నారు. 1969 ఐఏఎస్ బ్యాచ్ మధ్యప్రదేశ్ క్యాడర్‌కు చెందిన దత్.. రక్షణ శాఖ కార్యదర్శిగా, యూపీఏ ప్రభుత్వానికి డెప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుగా పని చేశారు. అనంతరం జనవరి 2010లో కేంద్రం ఆయనను చత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియ మించింది. యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లు రాజీనామా చేయా లన్న కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితోనే ఆయన తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే, రాజీనామాకు గల కారణాలను ఆయన స్పష్టం చేయలేదు.
మార్చడం ఆనవాయితే..!
కేంద్రంలో ప్రభుత్వం మారగానే అంతకు ముందు ప్రభుత్వాలు నియమించిన గవర్నర్లను మార్చడం ఆనవాయితీగా వస్తోంది. 2004లో కాంగ్రెస్ పార్టీ అ ధికార బాధ్యతలు చేపట్టిన వెంటనే.. అంతకు ముందు ఎన్డీయే ప్రభుత్వం నియమించిన నలుగురు గవర్నర్లను తొలగించింది. గతంలో ఇందిరా హ యాంలోనూ ఇలాగే జరిగింది. గత సంప్రదాయాలకు అనుగుణంగా బీజేపీ నేతృత్వంలోని సర్కారు కూడా అదే బాటలో నడుస్తోంది. కాంగ్రెస్‌కు వీర విధే యులుగా ఉండి గవర్నర్‌గిరి దక్కించుకున్న వారిని సాగనంపేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే కేంద్ర ¬ం శాఖ కార్యదర్శి పలువురు గవర్నర్లకు ఫోన్ చేసి ఈ మేరకు సమాచారమిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్ గవర్నర్ బీఎల్ జోషి రెండ్రోజుల క్రితం తన రాజీనామా సమర్పించారు. ఆయన బాటలోనే తాజాగా శేఖర్‌దత్ కూడా తప్పుకున్నారు. అయితే, కొంత మంది గవర్నర్లు మాత్రం రాజీనామా చేసేందుకు ససేవిూరా అన్నారు. కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ గవర్నర్లు షీలాదీక్షిత్, కే.శంకరనారాయణన్, ఎంకే నారాయణన్ తదితరులు రాజీనామా చేసేందుకు నిరాకరించినట్లు స మాచారం. పైగా తమకు లిఖితపూర్వకంగా సమాచారం ఇవ్వకుండా తక్కువ స్థాయి గల ¬ం శాఖ కార్యదర్శి చేత ఫోన్‌లో రాజీనామా చేయాలన్న సమా చారాన్ని ఇవ్వడంపై వారు మండిపడుతున్నారు. సరైన నిర్ణయాధికారం కలి గిన వారు కోరితే రాజీనామాపై ఆలోచిస్తానని
శంకరనారాయణ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే, తప్పుకోని వారిని సాగనంపేందుకు మోడీ ప్రభుత్వం
ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఆగస్టా వెస్ట్‌లాండ్ కుంభకోణంలో విచారణ ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్న గోవా, బెంగాల్ గవర్నర్లు బీవీ వాంచూ, ఎంకే నారాయణన్‌లను, అలాగే, కామన్వెల్త్ కుంభకోణంలో అభియోగాలు ఉన్న కేరళ గవర్నర్ షీలాదీక్షిత్‌ను తప్పించేందుకు ఆయా విచారణలను సాకుగా చూపనుంది. మరోవైపు, వచ్చే నెలలో పదవీ కాలం ముగియనన్న కర్ణాటక గవర్నర్ హెచ్‌ఆర్ భరద్వాజ్‌ను అప్పటివరకూ కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి రాగానే గవర్నర్లను మార్చే సంప్రదాయానికి తొలుత తెర లేపింది కాంగ్రెస్ పార్టీయే. అయితే, తాజా పరిణామాలపై ఆ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. చివరకు కాంగ్రెస్ నాయకత్వం సూచనల మేరకు దత్ రాజీనామా చేసినట్లు సమాచారం. తప్పుకోవాలని మోడీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన సూచనలు వస్తే రాజీనామా చేయాలని కాంగ్రెస్ సూచించనట్లు తెలుస్తోంది.