పాలమూరు అభివృద్ధికి కృషి చేస్తాం కేటీఆర్‌

ktr

మహబూబ్‌నగర్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి సమీపంలోని అప్పన్నపల్లి వద్ద రూ.16కోట్లతో నిర్మించిన రైల్వే ఓవర్‌ బ్రిడ్జిని రాష్ట్ర పంచాయతీరాజ్‌, ఐటీ శాఖమంత్రి కె.తారకరామారావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ… మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించి తెలంగాణ సాధించిన కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావడం జిల్లా ప్రజల కృతజ్ఞత ఫలితమన్నారు. వెనకబడిన పాలమూరు జిల్లాను తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన జిల్లాగా మారుస్తామన్నారు. మంత్రివర్గంలో మహబూబ్‌నగర్‌ జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించనున్నట్లు చెప్పారు. జడ్చర్ల- మహబూబ్‌నగర్‌ రహదారిని 4లేన్లుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ జగన్నాథం, ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ణ్‌ొడ్‌, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.