ఇంఫాల్: మణిపూర్‌లోని మీజోరాం రీజనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ విద్యార్థి తన హాస్టల్ గదిలో గురువారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. గత రాత్రి తన గదిలోకి వెళ్లిన బెంజామిన్ లాల్‌ఖాలా మువానా(25) ఉదయం సీలింగ్ ఫ్యాన్‌కు విగతజీవుడిగా వేలాడుతూ కనిపించాడు. పోలీసుల వివరాల మేరకు.. మువానాను పిలిచేందుకు వెళ్లిన స్నేహితులు అతను ఎంతసేపటికి డోర్ తీయకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ద్వారాన్ని పగలగొట్టారు. సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందిన మువానా కనిపించాడు. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఎటువంటి సూసైడ్ లెటర్ దొరకలేదు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. తల్లిదండ్రులకు సమాచారమందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు మృతికి గల కారణాలు తెలియలేదు.